Top 3 telugu moral stories
Telugu moral story 1
1.పట్నం ఎలుక మరియు గ్రామీణ ఎలుక కథ
అనగనగా రెండు ఎలుకలు, అవి రెండు స్నేహితులు. ఒక ఎలుకేమో పట్టణంలో నివసిస్తూ ఉండేది, మరొక ఎలుక ఏమో గ్రామంలో నివసిస్తూ ఉండేది. అయితే పట్నం ఎలుకకు, ఒకసారి గ్రామంలో ఉన్న తన స్నేహితుని చూడాలని కోరిక పుట్టింది. అనుకున్నదే తరువాయి స్నేహితుడిని, చూడడానికి గ్రామంలో ఉన్న ఎలుక దగ్గరకు బయలుదేరుతుంది. అక్కడ తన పాత స్నేహితున్ని కలుసుకొని చాలా సంతోషంగా, అవి రెండూ కూడా కాసేపు సమయం గడుపుతాయి. తర్వాత గ్రామం ఎలుక, నువ్వు ఎంతో దూరం నుండి వచ్చావు అలసిపోయి ఉంటావు ఉండు నీకు మంచి ఆహారాన్ని తెచ్చిపెడతాను,అనుకోని ఆహారం కోసం వెళ్లి, పట్నం ఎలుక కి మంచి కూరగాయలు, వేర్లు ,దుంపలు మరియు కాడలు వంటివి తీసుకొని వచ్చింది. అసలే పట్నం ఎలుక వాటిని చూస్తూనే, అయిష్టంగానే కొంచెం కొంచెం తినడం ప్రారంభించింది. అది గమనించిన గ్రామం ఎ లుక ఏమిటి, నీకు ఆకలిగా లేదా ఎందుకు కొంచెం కొంచెం తింటున్నావు అని అడిగింది.
అప్పుడు ఆ పట్నం ఎలుక, ఇలా అంది అసలు నువ్వు ఇక్కడ ఎలా ఉంటున్నావు. ఈ ఆహారం నువ్వు ఎలా తింటున్నావు? ఇంతటి అపరిశుభ్రమైన పరిసరాలలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు అంటూ ప్రశ్నించింది. వెంటనే పట్నం ఎలుక నువ్వు ఇక్కడ అసలు ఏ మాత్రం ఉండకు, నాతో పట్నానికి వచ్చేయ్ అక్కడ నీకు మంచి మంచి ఆహారం, నువ్వు ఎప్పుడు చూడని ఆహారం నీకు నేను రుచి చూపిస్తాను. ఒక్కసారి నువ్వు నాతో వచ్చావు అంటే ఇక అక్కడి నుండి రావడానికి ఏమాత్రం నువ్వు ఒప్పుకోవు. అక్కడే ఉండాలని అనుకుంటావు అలా ఉంటాయి, అక్కడ సౌకర్యాలు అని చెప్పింది. తర్వాత కొన్ని రోజులకు ఆ గ్రామంలోకి ఎలుక తన మిత్రుడు ఉండే పట్నానికి బయలుదేరింది. అక్కడ తన మిత్రుని కలుసుకొని చాలా సంతోష పడింది. తర్వాత పట్నం ఎలుక తన గ్రామీణ ఎలుకకు మంచి ఆహారాన్ని తినిపిద్దాం, అనుకొని డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకెళ్ళింది అక్కడ మంచి మంచి ఆహారాలు సువాసనతో కనిపిస్తున్నాయి. వెంటనే గ్రామం ఎలుక, పట్నం ఎలుక తో ఇలా అంది, ఇంత మంచి ఆహారాన్ని నేను ఊహించలేదు ఇక్కడ చాలా బాగుంది నేను కూడా ఇక్కడే ఉంటాను అని సంతోషంగా ఆ పట్నం ఎలుకతో అనింది. వెంటనే ఆహారాన్ని తినబోతూ ఉండగా అక్కడ పనిచేసే సేవకుడు వాటిని వెంబడించాడు. వెంటనే అవి భయంతో పారిపోయి ఒక రంధ్రం లో దాక్కున్నాయి. తర్వాత మరొక స్థలానికి తీసుకెళ్లి అక్కడ మరింత మంచి ఆహారాన్ని చూపించగా, గ్రామం ఎలుక చాలా సంతోషపడింది. తర్వాత ఆహారాన్ని తినబోతుండగా వెంటనే ఒక పిల్లి మావ్ మావ్ అంటూ వాటిని వెంబడించ సాగింది. అప్పుడు కూడా రెండు భయంతో పరిగెత్తాయి. అప్పుడు గ్రామం ఎలుక చాలా బాధపడింది. ఏమిటి ఆహారాన్ని తినడానికి కూడా, ఇంతలా భయపడుతూ తినాలా ,అసలు ఇదేమి జీవితం ఇలాంటి జీవితం అసలు జీవితమే కాదు అంటూ బోరున విలపించింది. నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను అంటూ తన మిత్రుడితో చెప్పి అక్కడి నుండి బయలుదేరి తన గ్రామంలో తాను హాయిగా సంతోషంగా జీవించసాగింది.
నీతి: భయం మరియు అనిచ్చితిమధ్య పుష్కలంగా ఉన్న సంతోష జీవితం కంటే, భద్రతతో కూడిన పేద జీవితం చాలా ఉత్తమం.
Telugu moral story 2
కాకి మరియు నక్క కథ
Foolish crow and clever fox moral story
ఒకానొకసారి ఎంతో ఆకలిగా ఉన్న ఒక కాకికి, ఒక తీయని బ్రెడ్ ముక్క దొరికింది. అయితే అది ఎంతో ఆనందంతో ,ఆ బ్రెడ్ ముక్క ను, తిందామని ఒక చెట్టు మీదకు వచ్చి వాలింది. అది ఆ బ్రెడ్ ముక్క తినబోతూ ఉండగా, అటుగా వెళుతున్న ఒక్క నక్క దానిని గమనించింది. ఎలాగైనా సరే కాకి దగ్గర ఉన్న ఆ బ్రెడ్ ముక్కను తినాలని ఒక పన్నాగం పన్నింది. కాకి దగ్గరకు వచ్చి నక్క, ఇలా అంది. ఓ కాకి నువ్వు ఎంత అందంగా ఉన్నావు. ప్రపంచంలో నీలా ఏ పక్షి కూడా ఇంత అందంగా ఉండదని నేను అనుకుంటున్నాను. నీ అందంతోపాటు నీ గొంతు కూడా చాలా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నాకోసం ఒక మంచి పాట పాడవ అని కాకిని, నక్క అడిగింది.కాకిని ఆ నక్క అలా పొగడ సాగింది. ఇంకేముంది ఆ నక్క మాటలను నమ్మిన కాకి, తనను అలా పొగిడేసరికి ఎంతో ఆనందంతో పొంగిపోయింది. ఆలోచించకుండా నోరు తెరిచి పాట పాడబోయింది. వెంటనే దాని నోట్లో ఉన్న బ్రెడ్ మొక్క కింద పడింది. కింద పడిన బ్రెడ్ ముక్కను నక్క తన నోటితో కరుచుకొని వెళ్లిపోయింది. తను చేసిన పొరపాటును గ్రహించి కాకి అక్కడి నుంచి వెళ్లిపోయింది బాధతో….
నీతి: మీకు మంచి మాటలు చెప్పే వ్యక్తులను, ఎల్లప్పుడూ గుడ్డిగా నమ్మవద్దు.
Telugu moral story 3
Old lion and clever fox moral story telugu
ముసలి సింహం మరియు తెలివైన నక్క కథ.
అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. అది క్రమంగా చాలా ముసలిది అయిపోయింది. చివరకు తనకోసం ఆహారాన్ని కూడా సేకరించుకోలేనంత ముసలిదిగా అయిపోయింది. అయితే తన దీనస్థితిని అడవిలోని ఒక పక్షికి వివరించింది. అలా ఆ పక్షి ద్వారా తన దీన పరిస్థితి అడవి మొత్తం వ్యాపించింది. జంతువులు కూడా సింహం యొక్క పరిస్థితికి చాలా బాధపడ్డాయి. ఒక్కొక్క జంతువు కూడా సింహాన్ని పరామర్శించడానికి వెళుతూ ఉన్నాయి. ఆ సింహం ముసలిదే కానీ, చాలా తెలివైనది.తనని పరామర్శించడానికి వచ్చిన జంతువులను చాలా ఈజీగా పట్టుకొని చంపి తినేది. ఒకరోజు తన దగ్గరికి ఒక నక్క వచ్చింది. నక్క కూడా సింహం మాదిరే చాలా తెలివైనది. ఆ నక్క సింహం గుహలోకి వెళ్లకుండా బయట నిలబడి, సింహం గారు ఎలా ఉన్నారు అని అడిగింది. అప్పుడు సింహం, నక్కను చూసి హలో మిత్రమా ఎలా ఉన్నారు? నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను. ఎందుకంటే నువ్వు నాకు చాలా దూరంగా నిలబడి ఉన్నావు .నేను కూడా చాలా ముసలి దాన్ని అయిపోయాను, దయచేసి కొంచెం దగ్గరికి రండి అంటూ అడగ సాగింది. సింహం మాట్లాడుతూ ఉండగా, నక్క చుట్టూ చూడ సాగింది. చివరగా అనక్క సింహం వైపు చూస్తూ సారీ సింహం గారు నేను మీ దగ్గరికి రాలేను, నాకు వేరే పని ఉంది అని చెప్పింది. మీ దగ్గరకు వచ్చిన జంతువులు అడుగులు లోపలికి వచ్చినట్లు ఉన్నాయి కానీ, తిరిగి బయటకు వచ్చినట్లు ఎక్కడా కూడా నాకు కనిపించలేదు అంటూ అక్కడ నుండి వెళ్లిపోయింది.