1.
” నీ మీద వేసిన నింద నిజమైతే తప్పు నీ సరి చేసుకో..అబద్ధము అయితే చిన్న నవ్వు నవ్వి ఊరుకో…”
2.
” ఉన్నత వ్యక్తిత్వం కలిగి ఉంటే శత్రువు కూడా నిన్ను చూసి,తల దించు కుంటాడు”
3.
.” డబ్బు సంపాదించ మని చెప్తుంది, కాలం ఆగకుండా పరుగెట్టమని చెబుతుంది.లక్ష్యం అతి కష్టమైన చేరమని చెప్తుంది.నమ్మకం వీటన్నిటికీ నేను ఉన్నాను అని భరోసా ఇస్తుంది”
4.
“తేనె లో ముంచిన కూడా వేప తన గుణాన్ని కోలు పోదు, పాము కి పాలు పోసిన దానిలో ఉన్న విషం పోదు.అట్లనే మనలో చెడు ఆలోచనలు నింపుకొని,ప్రతి నిత్యం గంగ స్నానం చేసిన మనలోని మలినాలు తొలగి పోవు”
5.
“వాన కురుస్తున్నప్పుడు అన్ని పక్షులు, గూళ్ళల్లో దాక్కుంటై, కానీ గద్ద మాత్రమే కురుస్తున్న వానకి,అందనంత దూరంలో మేఘాల పైపైకి ఎగురుతూ ఉంటుంది”
6.
“మన గురించి తెలియకుండా మన గురించి చెడ్డ గా.. మాట్లాడుతున్నారు అంటే,బాధ పడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళని, అదే పనిగా మొరుగుతాయి.
7.
” కింద పడకుండా ముందుకు సాగడం లో గొప్పదనం లేదు, కింద పడిన ప్రతిసారి,లేచి నిలబడి ముందుకు సాగడం లోనే,గొప్పదనం ఉంది”
8.
“మన దగ్గర ఉన్న డబ్బు ను చూసి దగ్గరికి వచ్చే బందువులు, అందాన్ని చూసి పుట్టే ప్రేమ,అవసరం కోసం చేసే స్నేహం,ఎప్పటికీ శాశ్వతం కావు”
9.
“ఎక్కడైతే నిన్ను హేళన చేశారో,అక్కడే నిన్ను నువ్వు నిరూపించు కో,ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేసి నారో,అక్కడే నువ్వు గెలిచి చూపించు. ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు,గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు”
10.
“నదులు తమలోని నీరు తామే తాగవు,చెట్లు తమ తియ్యని పండ్లను తామే తినవు,మేఘాలు తాము వర్షించిన నీటి,వలన పండిన పంటను తామే తినవు.అట్లనే సత్పురుషులు తమ యొక్క, జ్ఞానాన్ని సంపదను ఎప్పుడు పరుల కొరకే ఉపయోగిస్తారు”