TOP 6 BEST TELUGU MORAL STORIES IN TELUGU FOR KIDS|తెలుగు మోరల్ స్టోరీస్

TOP 6 BEST TELUGU MORAL STORIES IN TELUGU|టాప్ 5 తెలుగు మోరల్ స్టోరీస్ 

telugu moral stories are a treasure trove of wisdom and values. here we will share some of my favorite and famous Telugu moral stories. Telugu moral stories are important for a number of reasons. first, they provide children with a foundation of moral values. Telugu moral stories, teach the children about the importance of things like honesty, respect, and intelligence. Telugu moral stories are a valuable part of Telugu culture. and Telugu moral stories are a great source of entertainment.

 

HERE TOP 5 TELUGU MORAL STORIES LIST

1. MONKEY AND CROCODILE TELUGU MORAL STORY

2. DOG AND FOOLISH DONKEY TELUGU MORAL STORY

3. CLEVER FOX  TELUGU MORAL STORY

4. CRAB AND STORK STORY IN TELUGU

5. TORTOISE AND STORK TELUGU MORAL STORY

6.GOLDEN DUCK EGG AND FORMAR TELUGU MORAL STORY

TELUGU MORAL STORIES IN TELUGU

                                       

1. MONKEY AND CROCODILE TELUGU MORAL STORY

ఒక కోతి మరియు ముసలి స్నేహితులు. ఆ కోతి ప్రతిరోజు, ముసలికి తినడానికి కొన్ని తీయటి పండ్లు ఇచ్చేది. అయితే ఒకరోజు ఆ ముసలి భార్య ఏమని చెప్పింది అంటే, కోతి ఇచ్చిన పండ్లు ఇంత తియ్యగా ఉంటే కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని ముసలితో చెప్పి, నాకు ఆ కోతి గుండె తినాలని ఉందని ముసలితో చెప్పింది .అప్పుడు ముసలి, కోతి వద్దకు వచ్చి తన భార్య నిన్ను మా ఇంటికి రమ్మని ఆహ్వానించిందని కోతితో చెప్పింది. అప్పుడు కోతి, ముసలి వీపుపై కూర్చొని మొసలి ఇంటికి బయలుదేరింది. నదిలో మధ్యలోకి వెళ్లిన తర్వాత ముసలి ఇలా చెప్పింది ఓ కోతి నా భార్య నీ గుండె తినాలని నన్ను అడిగింది, అందుకే నిన్ను తీసుకెళ్తున్నానని కోతితో చెప్పింది. అప్పుడు కోతికి ఒక ఉపాయం తట్టింది.ఓ ముసలి నా గుండె చెట్టు పైన వదిలేసి వచ్చాను. మీ భార్యకు నా గుండె కావాలి అంటే మనం ఆ చెట్టు వద్దకు వెళ్లాలి అని, తిరిగి నది ఒడ్డుకు చేరుకున్నాయి. వెంటనే ముసలి వీపు పైనుండి కోతి దూకేసి, ఓ మిత్రమా నన్నే మోసం చేయాలని చూస్తావా అంటూ ,ఇంకెప్పుడు నన్ను కలవద్దు, నీకు ఎటువంటి పండ్లు కూడా ఇవ్వను అని చెప్పింది.

Moral:నమ్మిన మిత్రులను ఎప్పుడూ మోసం చేయవద్దు.

TELUGU MORAL STORIES IN TELUGU

                                 

2. DOG AND FOOLISH DONKEY TELUGU MORAL STORY

ఒక వాషర్ మాన్ దగ్గర ఒక గాడిద మరియు పెంపుడు కుక్క ఉన్నాయి. గాడిద అతనికి పనిలో సహాయం చేస్తూ కష్టపడుతూ ఉంటుంది. కానీ కుక్క మాత్రం తిని పడుకుంటూ ఉంటుంది,అయినా కూడా గాడిద బాధపడలేదు. ఒకరోజు రాత్రి ఒక దొంగ ప్రవేశించాడు .కుక్క నిద్రపోతూ ఉంది, కుక్క దగ్గర పడుకున్న గాడిద దొంగను చూసింది. ఆ విషయాన్ని పక్కన ఉన్న కుక్కకు చెప్పింది ,అయితే కుక్క దాన్ని అసలు పట్టించుకోలేదు. గాడిద మళ్ళీ మళ్ళీ కుక్కను మేలుకొల్పే ప్రయత్నం చేసింది, కానీ కుక్క ఎటువంటి చలనం లేకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఎలాగైనా అతని యజమానిని నిద్ర లేపాలని ఆలోచించింది. గాడిద గట్టిగా అరవడం ప్రారంభించింది, అప్పుడు యజమాని మేల్కొన్నాడు. చుట్టూ పక్కల చూశాడు అప్పుడు దొంగ పొదల్లో దాక్కున్నాడు. చుట్టుపక్కల ఎవరు కనిపించకపోవడంతో ఆ యజమాని కోపంతో నిద్ర లేపుతున్న ఆ గాడిదను కర్ర తీసుకొని చావబాదాడు.

Moral: ఎవరి పని వారే చేయాలి.

MORAL STORIES IN TELUGU

                                   

3. CLEVER FOX  TELUGU MORAL STORY

ఒకరోజు ఒక నక్కకు,చనిపోయిన ఏనుగు శరీరం కనపడింది. అప్పుడు నక్క హమ్మయ్య చాలు నాకు చాలా రోజులకు సరిపడా ఆహారం దొరికిందని సంతోష పడింది. కానీ ఆ నక్కకు అంతా మందపాటి చర్మం ఎలా తినాలో అర్థం కాక ఆలోచనలో పడిపోయింది. అయితే ఒక సింహం అటుగా వచ్చింది, నక్క ఆ సింహంతో తనకు సహాయం చేయమని చెప్పింది. కానీ ఆ సింహం ఒప్పుకోలేదు. తర్వాత ఒక పులి వచ్చింది ఆ పులితో, ఈ నక్క సింహం ఏనుగునీ చంపిందని చెప్పింది .వెంటనే పులి భయపడి పారిపోయింది .తర్వాత ఒక చిరుత పులి వచ్చింది సింహం దానిని చంపి స్నానానికి వెళ్లిందని ,నక్క చిరుత పులితో చెప్పింది .మనిద్దరం కలిసి ఆ సింహం వచ్చేలోపు ఈ ఆహారాన్ని తిందామని చెప్పింది .చిరుత పులి తన పదునైన పంజా లతో చర్మాన్ని చీల్చగానే వెంటనే సింహం వస్తుందని నక్క అబద్ధం చెప్పింది. దాంతో చిరుత అక్కడి నుంచి పారిపోయింది .ఆ తర్వాత నక్క సంతోషంగా ఆహారాన్ని ఆస్వాదించింది.

Moral: క్లిష్ట పరిస్థతుల్లో కూడా, తెలివైన నిర్ణయాలతో ఏదైనా సాధించవచ్చు.

TELUGU MORAL STORIES FOR KIDS

                                 

4. CRAB AND STORK STORY IN TELUGU

ఒక ముసలి కొంగ వయసు మీద పడడంతో ఇక చేపలను పట్టుకోలేక తన ఆరోగ్యం బాగా దెబ్బతింటూ వస్తోంది. అప్పుడు అది ఒక ప్రణాళికను రచించింది. ఒక సరస్సు వద్ద నిలబడి ఏడ్చుకుంటూ ఉంది. అది గమనించిన ఒక ఎండ్రకాయ అతనిని కారణం అడిగింది. అప్పుడు కొంగ కొన్నాళ్లుగా వర్షాలు కురవడం లేదని ప్రజలు మాట్లాడుకోవడం నేను విన్నాను అని కొంగ చెప్పింది. అప్పుడు ఆ ఎండ్రకాయ ఆందోళన చెంది, ఆ కొంగను చేపలను అన్నిటిని సమీపంలోని మరొక సరస్సుకు తీసుకు వెళ్ళమని చెప్పింది. అప్పుడు ఎండ్రకాయ తన స్నేహితులైన చేపలకు చెప్పడంతో అవి కూడా సంతోషించాయి. కొంగ వాటిని మరొక సరస్సుకు తీసుకువెళ్లే క్రమంలో దారిలో వాటిని తినేస్తూ వస్తోంది. చివరికి ఇప్పుడు ఎండ్రకాయ వంతు వచ్చింది. ఎండ్రకాయ కొంగ వీపు పైన ఎక్కి మరొక సరస్సుకు ప్రయాణం సాగించారు .అయితే దారిలో ఎండ్రాకాయ ,చేపల ఎముకల కుప్పను గమనించింది. తర్వాత దానికి పరిస్థితి మొత్తం అర్థమయింది. అప్పుడు వెంటనే కొంగ యొక్క మెడ కాయ ను తన పదునైన గోర్లతో  కొరికి చంపింది.

Moral: చెరపకు రా చెడేవు..

5. TORTOISE AND STORK TELUGU MORAL STORY

ఒక తాబేలు మరియు రెండు కొంగలు మంచి స్నేహితులు, వారు ప్రతి రోజు ఒక సరస్సు వద్ద కలుసుకొని నిత్యం మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక సంవత్సరం చాలా తక్కువ వర్షాలు కురిసాయి మరియు తాబేలు ఆందోళన చెందింది. అప్పుడు పర్వతానికి అవతల వైపున ఉన్న మరొక సరస్సు గురించి కొంగలు తాబేలుకి చెప్పాయి  అప్పుడు వారు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. తర్వాత కొంగలు, తాబేలునీ తమతోపాటు తీసుకో వెళ్లడానికి నిర్ణయించుకొని తాబేలుకు చెప్పాయి .అయితే తాబేలు తాను ఎగరలేనని చెప్పింది. అప్పుడు కొంగలకు ఒక ఐడియా వచ్చింది, మేము చెరొక వైపు కర్రను పట్టుకుంటాము, నీవు మధ్యలో నోటితో కర్రను పట్టుకోమని చెప్పాయి .అయితే ఎట్టి పరిస్థితుల్లో నోరు తెరవద్దని చెప్తాయి. అలా వెళ్తున్నప్పుడు జనాలు కింద గమనించి ఆశ్చర్యంతో చూస్తారు. అది చూసిన తాబేలు ఏదో చెప్పాలనుకుని నోరు తెరిచింది, వెంటనే కిందపడి తీవ్రంగా గాయపడింది.

Moral: జ్ఞానులు ఇచ్చే సలహాలు పాటించాలి.

6.GOLDEN DUCK EGG AND FORMAR TELUGU MORAL STORY

ఒక గ్రామంలో ఒక రైతు మరియు అతని భార్య వారితో కలిసి ఇద్దరు పిల్లలు ఒక కుటుంబంగా నివసించేవారు. ఒకరోజు రైతు ఒక బాతు కొన్నాడు .అది బంగారు గుడ్డు పెట్టడం చూసి ఆశ్చర్యపోయాడు .తర్వాత మార్కెట్కు వెళ్లి ఆ గుడ్డును అమ్మేవాడు మరుసటి రోజు కూడా అది బంగారు గుడ్డు పెట్టింది .అప్పుడు రైతు మరియు అతని భార్య సంతోషించారు రోజురోజుకు ఆ రైతు బంగారు గుడ్డు అమ్ముకొని ధనవంతుడు అయ్యాడు. ఒకరోజు అతను భార్య అతనితో ఏమండీ, గుడ్లు ఒకేసారి తీసుకుంటే మనం ఇంకా చాలా ధనవంతులు అవుతాము అంటూ చెప్పింది. ఆలోచన రైతుకు బాగా నచ్చింది, దంపతులు వెంటనే ఆ బాతునీ చంపి అందులో చూశారు .అక్కడ ఏమీ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయారు .అప్పుడు వారు చేసిన తప్పుడు పనికి బాధపడుతూ ఏడ్చారు.

Moral: అన్ని కావాలి అనుకుంటే, చివరికి ఏది దక్కదు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *