Telugu moral stories
అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అది ప్రతిరోజు ఆనందంగా, సంతోషంగా అడవిలో తిరుగుతూ జీవిస్తూ ఉండేది. అయితే ఆ నక్కకు ,ఒక రోజు ఎక్కడ చూసిన అసలు ఆహారం దొరకనే లేదు. నక్క ఇక బాగా అలసిపోయింది, అరె ఏమిటి ఈ రోజు నాకు అసలు ఎక్కడ ఆహారం దొరకనే లేదు అని బాధపడుతూ ఆలోచిస్తూ ఒకచోట కూర్చుంది.ఇలా ఆహారం దొరకకపోతే నేను ఇంకా నిరసించిపోతానని ఎలాగైనా నా మిత్రుల దగ్గరికి వెళ్లి అక్కడ ఆహారము ఉందేమో అడిగి కొంచమైనా నా పొట్ట నింపుకోవాలని ఆలోచించి అడవి దారి గుండా బయలుదేరింది, కానీ అక్కడ వారి మిత్రుల ఇంట్లో కూడా ఆహారం దొరకలేదు. ఇంకా చేసేది ఏమీ లేక అదే దారి గుండా తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది ఆ నక్క ఇంతలో దానికి ఒక నల్లగా నిగనిగలాడుతూ మంచి ఆకారంలో ఒక ద్రాక్ష చెట్టు కనపడింది, దానికి విపరీతంగా ద్రాక్ష కాయలు కాచి చాలా అందంగా కూడా కనిపిస్తోంది హమ్మయ్య చాలు ఈ నా జీవితానికి ఈ ఒక్క రోజు నా కడుపుని, పూర్తిగా నింపేసుకుని హాయిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకొని లోపల సంతోష పడింది. ఇక ద్రాక్ష కోసం ఆ నక్క ఎగర సాగింది ఎంత ఎగిరినా కూడా ఆ ద్రాక్ష పండ్లు ఆ నక్కకు అసలు అందలేదు. ఎన్నోసార్లు ప్రయత్నం చేసింది ఎగిరెగిరి మరింత అలిసిపోయిందే తప్ప ఒక్క ద్రాక్ష పండు కూడా ఆ నక్కకు దొరకలేదు. చేసేది ఏమీ లేక చివరికి ఆ ద్రాక్ష పళ్ళ వైపు అలాగే చూస్తూ నిలిచిపోయింది. అరెరే ఈ ద్రాక్ష పనులు అసలు మంచివి కావు చాలా పుల్లగా ఉంటాయి నేను తినడానికి అసలు పనికిరావు నేను ఇంకా ఎంతో తీయగా ఉంటాయనుకున్నా, ఛి ఈ పండ్లు చాలా పుల్లగా ఉంటాయి నాకు అసలు అందడం లేదు ఈ పండ్లు గురించి ఇక్కడ సమయం వృధా చేయడం కన్నా ఇంటికి వెళ్లిపోవడం మేలు అనుకుంటూ నిరాశతో ఆ నక్క అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోయింది
నీతి – మనకు అందనిది, అలాగే మనకు దొరకని దాని గురించి చెడుగా ఎప్పుడు మాట్లాడవద్దు.