అనగనగా ఒక అడవిలో ఒక నక్క నివసిస్తూ ఉండేది. అయితే అది ఒక రోజు అడవిలో తిరుగుతూ ఉండగా దానికి బాగా దాహం వేసింది అయితే అది అడవిలోని ఒక భావి వద్దకు చేరుకుంది. అయితే అది అలా నీరు తాగే క్రమంలో అనుకోకుండా ఆ నీటి లో పడిపోయింది, ఎంత ప్రయత్నం చేసిన బయటకు రాలేకపోయింది. ఇక నా పని అయిపోయింది, ఇక నాకు మరణమే తరువాయి అని ఆలోచిస్తూ చాలా బాధగా నీటిలో కూర్చుని పోయింది. అయితే అదే సమయంలో అటుగా పోతున్న ఒక మేక దానికి కనిపించింది వెంటనే నక్క తన మెదడుకు పని చెప్పింది. ఎలాగైనా నేను ఈ మేకను మోసం చేసి ఈ బావిలోని నీటిలో నుండి బయట పడాలని పన్నాగం పన్నింది. అటుగా పోతున్న ఒక మేకను పిలిచి మేకా మేక ఒకసారి ఇటు రా అని పిలవ సాగింది. వెంటనే అటు పోతున్న మేక కూడా నక్క ఉన్న నీటి వైపు వచ్చింది. ఏమిటి నక్క బావ నీటిలో ఏం చేస్తున్నావ్ అంటూ నక్కను అడగసాగింది. వెంటనే నక్క తన బుద్ధికి పదును చెప్పి ఓ మేక ఎటు పోతున్నావు ఇక్కడ చూడు ఈ నీళ్ళు ఎంత తియ్యగా ఉన్నాయో ,నీటి కోసమే వచ్చాను నేను, నేను ఇక్కడే ప్రతిరోజు నీళ్లు తాగుతాను. నువ్వు కూడా ఒకసారి నీటిని తాగి చూడు మళ్ళీ మళ్ళీ ఈ నీటి కోసం నువ్వు కూడా నాలాగే వస్తావు అని దానికి నమ్మే విధంగా మాటలు చెప్ప సాగింది . తెలివి లేని మేక నక్క చెప్పే మాటలు విని ఏమాత్రం కూడా ఆలోచించకుండా వెంటనే ఆ బావిలోకి దూకేసింది వెంటనే నక్క మేకపైకి ఎక్కి బావిలో నుంచి పైకి ఎగిరిపోయింది తర్వాత తాను చేసిన పనికి మేక బాధపడుతూ అక్కడే నీటిలో ఉండిపోయి చివరికి చనిపోయింది .
నీతి ; ఎవరో చెప్పే మాటలు విని ఆలోచించకుండా ఏ పని చెయ్యొద్దు .