Telugu moral stories on friendship||స్నేహం నీతి కథలు ఫర్ కిడ్స్

Telugu moral stories on friendship; the importance of true friendship

Friendship is one of the most important things in life.it is a bond that is built on trust, loyalty, and love. true friends are always there for us. Here, we explore some Telugu moral stories on friendship. we will learn about the qualities of true friendship.

1. The Fox, Tortoise, and Lion friendship telugu moral story

Telugu moral stories on friendship

 

telugu moral stories on friendship

అనగనగా ఒక అడవిలో ఒక సరస్సు వద్ద ఒక నక్క మరియు తాబేలు నివసిస్తూ ఉండేవి .అవి రెండు దగ్గరగా నివసిస్తూ ఉండడంతో అవి మంచి స్నేహితులుగా మారాయి. ఒకరోజు అవి రెండు కలిసి అడవికుండా నడుచుకుంటూ ప్రయాణం చేస్తున్నాయి, అయితే ఇంతలో అక్కడికి ఒక సింహం వచ్చింది. వెంటనే సింహాన్ని చూసి ఆ రెండు కూడా ప్రాణభయంతో అక్కడి నుండి పరిగెత్తడం ప్రారంభించాయి. అయితే నక్క మాత్రం వేగంగా వెళ్ళిపోయింది. తాబేలు నిదానంగా ఉండడంతో ఆ సింహం తాబేలును పట్టుకుంది ,అయితే ఆ సన్నివేశాన్ని దూరంగా నుండి ఆ నక్క చూస్తూ ఉంది. ఎలాగైనా నా తాబేలు స్నేహితుడిని కాపాడాలి అని అనుకుంది. సింహం ఆ తాబేలును తినడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ దానిని కొరకడం దానివల్ల కాలేదు చిప్ప చాలా గట్టిగా ఉండడంతో తాబేలు ను తినడానికి దానికి వీలు కాలేదు. తర్వాత నక్క మెల్లగా దాని దగ్గరికి వచ్చి సింహ రాజా, నువ్వు ఈ తాబేలు తినాలంటే దీనిని ముందుగా నదిలోకి విసరి వేయి అప్పుడు ఇది మెత్తగా మారుతుంది నువ్వు తినడానికి వీలుగా ఉంటుంది అని చెప్పింది. వెంటనే సింహం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే తాబేలును నదిలోకి విసిరేసింది ,అప్పుడు అక్కడి నుండి నక్క కూడా పారిపోయింది. తర్వాత తను చేసిన తప్పుకు సింహం బాధపడుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది ఆ విధంగా నక్క తన స్నేహితుడైన తాబేలును తెలివైన ఆలోచనతో కాపాడుకుంది.

 

Moral: కష్ట కాలంలో నిజమైన మిత్రులు మాత్రమే సహాయం చేస్తారు.

 

2.Rabbit and Friends telugu moral story on friendship

telugu moral stories on friendship

అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది, ఆ కుందేలుకు అడవిలో ఎంతోమంది స్నేహితులు ఉండేవారు. అలా అంతమంది స్నేహితులు ఉన్నందుకు, చాలా ఆనందంగా ఉండేది. అయితే ఒకరోజు అడవిలో అది ఆడుతూ ఉండగా ఒకసారి ఒక సింహం తన దగ్గరికి వస్తూ ఉండడాన్ని గమనించింది. వెంటనే ఆ కుందేలు భయపడి దగ్గరలోని ఒక ఏనుగు దగ్గరికి వెళ్లి సహాయం చేయమని అడిగింది, అయితే ఆ ఏనుగు నీకు సహాయం చేయాలి అనుకుంటున్నాను కానీ నాకు వేరొక పని ఉంది, అంటూ అక్కడి ఉండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కుందేలు అదే అడవిలో కొమ్ములు తిరిగిన ఎద్దు దగ్గరికి వెళ్ళింది. ఓ  ఎద్దు రాజా నా కోసం సింహం వస్తుంది దయచేసి మీ కొమ్ములు తో సింహాన్ని నా దగ్గరకు రాకుండా ఆపండి అని ప్రాధేయపడింది. అయితే ఎద్దు కూడా నేను సింహాన్ని పారిపోయేలా చేయగలను కానీ, నాకు రైతు నన్ను పొలంలోకి పనికి పిలిచాడు కాబట్టి నేను వెళ్ళాలి అంటూ ఎద్దు అక్కడి నుండి వెళ్ళిపోయింది .ఇప్పుడు కుందేలుకు ఒక జింక కనబడింది, దయచేసి నాకు సహాయం చేయి మీరు నన్ను వీపు పైన ఎక్కించుకొని ఎక్కడికైనా దూరంగా తీసుకుపోండి అని అడిగింది .నిన్ను నామీద మోస్తూ ఆ భారాన్ని ఎందుకు పెంచుకోవాలి అని జింక ఆలోచించింది. నాకు కూడా సింహం అంటే భయమే కాబట్టి నా ప్రాణాలు రక్షించుకోవడానికి నేను కూడా పరిగెత్తాలి అని అక్కడ నుంచి వెళ్లిపోయింది. చూస్తుంటే సింహం తన దగ్గరికి రావడం కుందేలు గమనించింది .ఇక అతనికి వేరే మార్గం కనిపించకపోవడంతో అది వీలైనంత వేగంగా అక్కడి నుండి పరిగెత్తింది. తర్వాత చాలా దూరం వెళ్లి తనను తాను రక్షించుకుంది. అయితే అప్పటినుండి కుందేలు తనకు చాలామంది స్నేహితులు మాత్రమే ఉన్నారని అయితే అసలు స్నేహితుడే లేడని వాళ్ళందరూ కూడా స్వార్థపరులని అర్థం చేసుకుంది. ఎప్పటికైనా మనల్ని మనమే నమ్ముకోవాలి అని అర్థం చేసుకొని అప్పటినుండి హాయిగా సంతోషంగా జీవించసాగింది.

Top 6 మంచి తెలుగు నీతి కథలు ఇక్కడ చదవండి 

Moral: ఇతరుల మీద నమ్మకం ఉంచే బదులు మిమ్మల్ని మీరు నమ్ముకోండి.

3. Manchi mitrulu moral story on friendship

telugu moral stories on friendship

అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు ఎలుక మరియు ఒక కాకి ఎంతో మంచి స్నేహితులుగా ఆనందంగా జీవించేవి. జింక ఎంతో కంగారుగా భయపడుతూ అక్కడికి వచ్చింది ఆ జింకను చూసిన కాకి చెట్టు పైకి ,ఎలుక రంద్రంలోకి, తాబేలు నీటిలోకి దూకి oది. తర్వాత అవి జింకను చూసి భయపడాల్సిన పనిలేదు అని జింక దగ్గరకు వచ్చి దానిని పరామర్శించాయి. అయితే జింక తనను ఒక వేటగాడు వెంటాడుతున్నాడని చెప్పి బాధపడింది .అప్పటినుండి ఆ జింక కూడా ఆ ముగ్గురితో స్నేహం చేస్తూ నలుగురు కూడా మంచి స్నేహితుడుగా మారిపోయారు. ఒకరోజు ఆకస్మాత్తుగా జింక కనబడకుండా పోయింది కాకి, ఎలుక మరియు తాబేలు కంగారుపడ్డాయి ,మూడు కూడా వెతకడం ప్రారంభించాయి. అయితే తాబేలు నేను ఎక్కువ వేగంగా నడవలేను కాబట్టి, కాకికి ఆ పని అప్పజెప్పింది. కాకి అడవి అంత తిరుగుతూ ఆ జింక ఒక వలలో బందించ బడి ఉండడం చూసి తన మిత్రులైన ఎలుక మరియు తాబేలు కి చెప్తుంది .వెంటనే ఎలుక కాకి అక్కడికి చేరుకుంటాయి ,తర్వాత నిదానంగా తాబేలు కూడా ఆపదేశానికి చేరుకుంటుంది. అక్కడ వలలో బంధించబడిన జింకను ఎలుక తనపళ్ళతో వలని, కొరికి జింకను కాపాడుతుంది. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వేటగానికి కోపంతో చిరిగిపోయిన వల ను, చూసి అక్కడికి వచ్చిన తాబేలును పట్టుకుంటాడు. అయితే ఆ మూడు కూడా మరొక అద్భుతమైన ప్రణాళిక రచించి, ఒక నది ఒడ్డున జింక చనిపోయినట్టు నటించమని చెప్తాయి. అప్పుడు వేటగాడు చనిపోయిన జింకను చూసి పట్టుకున్న తాబేలును కింద వదిలిపెడతాడు, వెంటనే ఆ జింక లేచి పరిగెడుతుంది .తర్వాత తాబేలు కూడా నీటిలోకి తన ప్రాణాలు కాపాడుకుంటుంది.

 

Moral: పిల్లలు ఈ కథ కి ,మంచి నీతి నీ మీరే కామెంట్స్ తెలుప గలరు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *