Rabbit and Tortoise Story in Telugu
Rabbit and Tortoise Story in Telugu ;అనగనగా ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది అయితే ఆ కుందేలుకు తాను పరుగుపందెంలో నేనే నెంబర్ వన్ అని చాలా గర్వంగా ఉండేది. అయితే ఒక రోజు అది ఒక తాబేలు వద్దకు వెళ్ళింది, తాబేలుతో ఈ అడవిలో నాతోపాటు ఎవ్వరు కూడా పరిగెత్తలేరు అని దానితో గర్వపు మాటలు చెప్పసాగింది. తర్వాత అదే తాబేలు ను కుందేలు మనిద్దరం ఒక పందెం పెట్టుకున్నాము అందులో ఎవరు విన్ అయితారు చూద్దామని తాబేలుతో పందెం కాసింది.
తర్వాత వీరిద్దరి పందానికి న్యాయం నిర్ణేత గా ఒక నక్కను నియమించుకున్నాయి. ఇక పందెం మొదలుపెట్టాయి. పందెం ఏమిటంటే ఒక నిర్దిష్టమైన గమ్యస్థానాన్ని ఎవరు ముందు చేరుకుంటారు అని, ఇక పందెం మొదలైంది కుందేలు ఎంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళుతుంది. ఇక తాబేలు చాలా నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ నిదానంగా పందెం మొదలుపెట్టింది అయితే చాలా దూరం పరిగెత్తిన కుందేలు ఆ నత్తనడక తాబేలు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది.
ఈలోపు నేను ఈ చెట్టు కింద ఒక కునుకు తీసి తిరిగి మళ్లీ పరుగును ప్రారంభిస్తా అనుకుని ఆ చెట్టు కింద హాయిగా నిద్రపోయింది. తాబేలు నిదానంగా వస్తూ కుందేలు నిద్రపోతున్న చెట్టు వద్దకు వచ్చింది, అక్కడ ఎటువంటి శబ్దం చేయకుండా మెల్లగా అక్కడి నుంచి దాటుకొని చివరికి తన గమ్యస్థానం చేరుకుని అక్కడ వేచి చూడ సాగింది. తర్వాత కొంత సమయానికి కుందేలుకి మెలుకువ వచ్చి పరుగు తీసింది ఇంకేముంది అక్కడ గమ్య స్థానానికి చేరుకునే లోపే కుందేలు, ముందే తాబేలు ని చూసి కుందేలు తన గర్వానికి సిగ్గుతో తలదించుకొని తన ఓటమిని ఒప్పుకుంది.
ఈ కథ ని కూడా చదవండి : రాజును కోరిన కప్పలు
నీతి ; ఎప్పుడు ఎవ్వరిని తక్కువ అంచనా వెయ్యొద్దు