అనగనగా ఒక అడవిలో ఒక సింహం నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ సింహం ఒక చెట్టు కింద మంచి గాఢ నిద్రతో పడుకుని ఉంది. అయితే అదే సమయంలో ఒక చిట్టెలుక అటుగా వెళుతూ నిద్రపోతున్న సింహం ముక్కులోకి వెళ్ళింది. వెంటనే ఆ సింహానికి విపరీతమైన కోపం వచ్చింది మంచిగా నిద్రపోతున్న నన్ను నిద్ర లేపుతావా అంటూ ఆ ఎలుక పై కోపంతో వెంటనే తన పంజా తో ఆ ఎలుక ను పట్టుకుంది. వెంటనే భయపడి పోయిన ఆ ఎలుక, మహాప్రభువ, అడవిరాజా నేను పొరపాటున ఈ పని చేశాను. నన్ను క్షమించు ఇంకెప్పుడూ ఇటువంటి పని చేయను, ఈరోజు నా మీద దయ చూపించి వదిలేస్తే ఏదో ఒక రోజు నీకు నేను సాయం కచ్చితంగా చేస్తాను అంటూ ఆ సింహం రాజును వేడుకుంది ఆ చిట్టెలుక. వెంటనే ఆ సింహం గట్టిగా నవ్వుతూ ఓహో చిట్టెలుక రవంత లేవు ఇంత పెద్ద అడవికి రాజు అయిన నాకు నీవు సహాయం చేస్తావ, అంటూ గట్టిగా నవ్వడం ప్రారంభించింది. అయితే చిట్టెలుక నన్ను నమ్ము మహారాజా ఏదో ఒక రోజు నీకు సాయం ఖచ్చితంగా చేస్తాను అంటూ చాలా దీనంగా వేడుకుంది. కొద్దిసేపటి తరువాత సింహం దయతో ఆ ఎలుకను వదిలేసింది. అయితే కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఒకరోజు ఆ సింహం వేటగాడు వేసిన ఒక వలలో చిక్కుకుంది ఎంత ప్రయత్నం చేసిన ఆ వల నుంచి బయటకు రాలేకపోయింది .దాంతో దిక్కుతోచక ఆ సింహం గట్టిగా గర్జించడం ప్రారంభించింది ఆ గర్జన అడవి మొత్తం వినిపిస్తూ ఉంది ఈ గర్జన విన్న ఎలుకకు ,అడవిరాజు సింహం ఏదో కష్టాలలో ఉన్నాడు అని గ్రహించి వెంటనే ఆ అరుపులు వినిపిస్తున్న వైపుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడికి చేరుకున్న తర్వాత సింహరాజా మీకు ఈ కష్టం వచ్చింది దీని నుండి నేను మిమ్మల్ని కచ్చితంగా కాపాడుకుంటాను అంటూ వలలు మొత్తం కొరికి పడేసింది వెంటనే వల మంచి సింహం బయటకొచ్చి ఆ యొక్క ఎలుకకు కృతజ్ఞతలు తెలుపుతుంది .అప్పుడు ఎలుక సింహరాజు తో ఇలా అన్నది సింహ రాజ నేను ఆరోజు మీకు సహాయం చేస్తాను అంటే మీరు నన్ను చూసి నవ్వుకున్నారు, చూశారా ఈరోజు నేను మిమ్మల్ని ఎంత పెద్ద ప్రమాదం నుండి బయట పడేసాను అంటూ సింహంతో అనేసరికి సింహం తను చేసిన పొరపాటుకు తను మరొక్కసారి ఎలుకకు కృతజ్ఞతలు తెలిపి అక్కడినుండి వెళ్లిపోయింది.
నీతి ; మనం ఇతరుల పైన చూపే ప్రేమ దయ ఎదో ఒక రోజు మనకి కూడా ఉపయోగ పడుతుంది .