Podupu Kathalu In Telugu
1.ఆకాశంలో అంబు ,అంబులో చెంబు, చెంబులో చారడు నీళ్లు.
సమాధానం; టెంకాయ
- వందమంది అన్నదమ్ములకు ఒకటే మొల త్రాడు.
సమాధానం; చీపురు కట్ట
- అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది తైతక్కలాడింది.
సమాధానం; కవ్వం
- అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు.
సమాధానం; ఉల్లిపాయ
- ఇంతింత నా బండి, ఇనుపకట్ల బండి .తొక్కుతే నా బండి 96 ఆమడలు పోతుంది.
సమాధానం; సైకిలు
6.తల నుండి పొగ చిమ్ముతుంది, భూతం కాదు. కన్నులెరగా ఉండు, రాకాసి కాదు పాకి. పోవుచుండును పాము కాదు ఏమిటది.
సమాధానం; రైలు బండి
7.ఇల్లంతా ఎలుక కన్నాలు.
సమాధానం; జల్లెడ
- చేతితో పారేసి, నోటితో ఏరుతారు.
సమాధానం: అక్షరాలు
- ఊరు అందరికీ ఒకటే దుప్పటి.
సమాధానం: ఆకాశం
మరిన్ని పొడుపు కథలు కూడా చదవండి
- ఎందరు ఎక్కిన విరగని మంచం.
సమాధానం: అరుగు
- ఎంత మూసినా చప్పుడు కావు.
సమాధానం: కనురెప్పలు
- తోకలేని పిట్ట 90 ఆమడలు పోతుంది
సమాధానం: ఉత్తరం
- ఎండిన బావిలో పిల్లలు గంతులు వేస్తారు.
సమాధానం: మొక్కజొన్న పేలాలు
- పచ్చని మేడ, తెల్లని గదులు, నల్లని దొంగలు.
సమాధానం: సీతాఫలం పండు.
15.గూటిలో గువ్వ, ఎంత గుంజిన రాదు. అటు ఇటు కదులుతుంది.
సమాధానం: నాలుక
16.ఊరు అందరికీ ఒకటే దీపం.
సమాధానం: సూర్యుడు
- కాళ్లు లేవుగాని నడుస్తుంది,కళ్ళు లేవు గానీ ఏడుస్తుంది.
సమాధానం: మేఘం
- ఆకు వేసి అన్నం పెడితే,ఆకు తీసేసి భోజనం చేస్తాం.
సమాధానం: కరివేపాకు
- ఎక్కలేని దిగలేని మాను గంపెడు కాయలు కాచు.
సమాధానం: మిరప చెట్టు
- ఎర్రని పండు మీద ఈగైన వాలదు.
సమాధానం: నిప్పు
Telugu podupu kathalu|పొడుపు కథలు మరియు జవాబులు
- తెల్ల కోటు తొడుక్కున్న ఎర్రముక్కు దొర.
సమాధానం: కొవ్వొత్తి
- ఇంటిలోన మొగ్గ,బయటనేమో పువ్వు.
సమాధానం: గొడుగు
- ఆ ఇంటికి ఈ ఇంటికిముక్కు మధ్య ఒకటే దూలo
సమాధానం: ముక్కు
- ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది.
సమాధానం: అద్దం
- నల్ల కుక్కకు నాలుగు చెవులు.
సమాధానం: లవంగం
- సన్నని స్తంభం, ఎక్కలేరు దిగలేరు.
సమాధానం: సూది
27.పొట్టలో వేలు నెత్తిమీద రాయి.
సమాధానం: ఉంగరం
- వాన లేక ఎండా లేక పైరు పచ్చంగా, ఆపు లేక సున్నాలు లేక నోరు ఎర్రగా.
సమాధానం: రామ చిలుక
- నేను అమ్మకు తమ్ముడిని కాను, కానీ మీకు నేను మేనమామను.
సమాధానం: చంద మామ
- ఐదుగురిలో చిన్నోడు, పెళ్లికి మాత్రం పెద్దోడు
సమాధానం: చిటికెన వేలు
- ఒక గుద్దుకు ఇద్దరు పిల్లలు బయటికి వచ్చారు.
సమాధానం: వేరుశనగకాయ
- చిటపట చినుకులు చిటారు చినుకులు ఎంత కురిసిన వరదలు రావు.
సమాధానం: కన్నీళ్లు
- గుండు మీద గుండు ఎంత పెట్టినా నిలవదు.
సమాధానం: కోడి గుడ్డు
- అమ్మ అంటే దగ్గరకు వస్తాయి. అయ్యా అంటే దూరంగా పోతాయి.
సమాధానం: పెదవులు
- అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది.
సమాధానం: ఈత చెట్టు
- ఒకటే ఇంట్లో 60 మంది దొంగలు ఉంటారు.
సమాధానం: అగ్గిపుల్ల లు
- ఆకాశంలో 60 గదులు, గది గదికో సిపాయి ,సిపాయికో తుపాకీ.
సమాధానం: తేనె పట్టు
- ఆ కొండకు ఈ కొండకు ఇనుప సంకెళ్లు.
సమాధానం: చీమలదండు
- ఆకాశాన కొడవళ్ళు వేలాడుతున్నాయి.
సమాధానం: చింత కాయలు
Telugu podupu kathalu|పొడుపు కథలు మరియు జవాబులు
- ఆకాశంలో ఎగురుతుంది.పక్షి కాదు.మనుషుల్ని ఎగరేసుకొని పోతుంది గాలి కాదు.
సమాధానం: విమానం
- పొట్టి వాడికి ఒళ్లంతా బట్టలే.
సమాధానం: ఉల్లిపాయ
- ఎర్రని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది
సమాధానం: దీపం
- కడుపునిండా రాగాలు,ఒంటినిండా గాయాలు
సమాధానం: మురళి
- సముద్రంలో పుడుతుంది, ఊరిలో కొచ్చి అరుస్తుంది
సమాధానం: శంఖం
- ఆకులు లేని అడవిలో, జీవం లేని జంతువు జీవాలను వేటాడుతుంది.
సమాధానం: దువ్వెన
- నాలుగు కర్రల మధ్య నల్లని రాయి.
సమాధానం: పలక
- రాణి గారి తోటలో రోజా పూలు చూసే వారే గాని లెక్క పెట్టలేరు.
సమాధానం: నక్షత్రాలు
- చీకటి ఇంట్లో జడలు దయ్య0
సమాధానం: ఉట్టి
- ముగ్గురు అన్నదమ్ములు ఒకేసారి పుడతారు ఒకేసారి చనిపోతారు.
సమాధానం: ఫ్యాన్
- ఇల్లు అంతా వెలుగు బల్ల కింద చీకటి.
సమాధానం: దీపం
- చెయ్యని కుండ,పోయని నీళ్లు ,వెయ్యని సున్నం, తీయగా ఉండు.
సమాధానం: టెంకాయ
- నాలుగు కాళ్లు ఉన్నాయి కానీ, జంతువునీ కాదు. రెండు చేతులు ఉన్నాయి కానీ, మనిషినే కాదు.
సమాధానం: కుర్చీ
- ఒంటిపై చేయి వేస్తే కరువందే వదలదు.
సమాధానం: నిప్పు
- ఒకటే సీసాలో రెండు రంగులు.
సమాధానం: కోడి గుడ్డు
- గదినిండా రత్నాలు గదిలో తాళం.
సమాధానం: దానిమ్మ పండు
- చుట్టమై చూడనీకి వస్తే దయమై పట్టుకున్నాడు.
సమాధానం: రేగు చెట్టు
- సంత లన్ని తిరుగుతాడు సమానంగా పంచుతాడు.
సమాధానం: తక్కెడ
- వేయి కళ్ళు కల ఇంద్రునికి చూపులేదు.
సమాధానం: వల
- వెలేడు అంత తోడు, తాడిని కొట్టాడు.
సమాధానం: గొడ్డలి
Telugu riddles with answers|తెలుగు పొడుపు కథలు మరియు జవాబులు
61.వేప కాయంత బంగారాన్ని ఏనుగైనా మోయలేదు.
సమాధానం: నిప్పు
- వెనుకకు పోకుండా ముందుకు పోయేది.
సమాధానం: బాణం.
- వింత వింత బండి, ఎగిరిపోయే బండి ,మండుతూ మండుతూ మాయమయ్యే బండి.
సమాధానం: సూర్యుడు
- లోతు బావిలో జిగురు బెల్లం.
సమాధానం: గుబిలి
- రెండు కొండల మధ్య గంగానది పారుతుంది.
సమాధానం: పాపిట
- మొదట నల్లదానిని, తర్వాత ఎర్రదానిని, ఆ తరువాత తెల్ల దానిని.
సమాధానం: బొగ్గు
- మీ నాన్న మా నాన్న రెండు ఎద్దులు పట్టుకొస్తే కుడి ఎడమకు రాదు ఎడమ కుడికి రాదు.
సమాధానం: చెప్పులు
- మీ మామయ్య మా మామయ్య ఒక్కరే.
సమాధానం: చంద మామ
- మా తాత సంతకు వెళ్లి తుడిమెలేని వంకాయ తెచ్చాడు.
సమాధానం: గుడ్డు
- నాకు గుండె ఉంది కానీ అది కొట్టుకోదు.
సమాధానం: పేకాట కార్డ్
- అది మీదే కానీ, మీ కన్నా వేరే వాళ్ళే ఎక్కువగా వాడుతారు.
సమాధానం: మీ పేరు
- నాలో ఎన్నో నగరాలు ఉంటాయి కానీ, ఇల్లులు ఉండవు. నాలో ఎన్నో అడవులు ఉంటాయి కానీ, చెట్లు ఉండవు.నాలో ఎన్నో నదులు ఉంటాయి కానీ, నీళ్లు ఉండవు.
సమాధానం: మ్యాప్
- నాకు తలకాయ (head) ఉంటుంది కానీ బాడీ ఉండదు.
సమాధానం: కాయిన్
- నా ఒళ్లంతా రంద్రాలే ఉంటాయి కానీ,నేను నీళ్లను ఒడిసి పట్టుకోగలను.
సమాధానం: స్పాంజి
- నాకు రెక్కలు లేకపోయినా ఎగురుతాను ,కళ్ళు లేకపోయినా ఏడుస్తాను .నేను ఎవరిని?
సమాధానం: మేఘం
- నన్ను తినడానికి కొంటారు కానీ,తినలేరు.
సమాధానం: ప్లేట్
- నాకు ఒకటే కన్ను ఉంటుంది కానీ నేను చూడలేను.
సమాధానం: సూది
- నాకు నాలుగు కాళ్లు ఉంటాయి. కానీ నేను నడవలేను నేనెవరిని.
సమాధానం: కుర్చీ
- పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పటికీ తగ్గదు.
సమాధానం: వయస్సు
- ఒక అరలో ముగ్గురు దొరసానులు.
సమాధానం: ఆముదము గింజ
- ఒక గదిలో 32 పాములు వాటి కాపలా రాక్షసుడు.
సమాధానం: నాలుక
- చాచుకొని సావిట్లో పడుకుంటుంది,ముడుచుకొని మూల నక్కుతుంది.
సమాధానం: చాప
- ఊరంతా తిరిగి వచ్చి ఇంటి ముందు ఆగుతాయి.
సమాధానం: చెప్పులు
- ఎంత దానం చేసినా తరగనిది,అంతకంతకు పెరిగేది.
సమాధానం: చదువు
- కానరాని అడివిలో కర్రి ఆవు మేస్తుంది.
సమాధానం: పేను
- గట్టుమీద పోరగాడు ముట్టగానే ఏడుస్తాడు.
సమాధానం: డప్పు
- ఎర్రని కోటలో తెల్లని బటులు.
సమాధానం: పళ్లు
- కోసిన తెగదు, కొట్టిన ఏడవదు.
సమాధానం: నీడ
- ఒకే అగ్గిపెట్టలో ఇద్దరూ పోలీసులు.
సమాధానం: వేరు శనగ కాయ
- చిట్టచివరి కొమ్మలు చిలక గుడ్లు పెట్టింది.
సమాధానం: నేరేడు పండ్లు.
- తలకు తోకకు ఒకటే టోపీ.
సమాధానం: పెన్ను
- అన్ని దేశాలకు, ఇద్దరే రాజులు.
సమాధానం: సూర్య చంద్రులు
- ఒళ్లంతా ముళ్ళు, కడుపంతా చేదు.
సమాధానం: కాకరకాయ
- కన్నీరు కారుస్తాను కానీ, మనిషిని కాను. వెలుగునిస్తాను కానీ సూర్యున్ని కాదు, ప్రాణం పోతుంది కానీ, జీవం లేదు.
సమాధానం: కొవ్వొత్తి
- ముగ్గురు అన్నదమ్ములు, కానీ ఒకరినొకరు తాకలేరు.
సమాధానం: ఫ్యాన్
- ఆ మనిషికి రెండే చేతులు ఏడు కాళ్లు.
సమాధానం: నిచ్చెన
- నేను నడుస్తూనే ఉంటా నన్ను ఎవరు ఆపలేరు, తిరిగి తెచ్చుకోలేరు.
సమాధానం: కాలం
- వీధిరాజుకి కొప్పు ఉంది కానీ, జుట్టు లేదు కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు.
సమాధానం: కొబ్బరి కాయ
- అడుగులు ఉన్న కాళ్లు లేనిది? ఏమిటది?
సమాధానం: స్కేల్