కార్తికేయ 2 వంటి సెన్సేషనల్ చిత్రం తర్వాత దర్శకుడు చందు మొండేటి, యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా ఒక కొత్త చిత్రం ప్రకటించడం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఈ చిత్ర నిర్మాతలు ఒక అదిరిపోయే అప్డేట్ నీ అక్కినేని అభిమానుల కోసం, చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ ని వారు విడుదల చేశారు.
ఇక ఈ చిత్రానికి ‘తండెల్’ అని టైటిల్ను ఖరారు చేశారు. టైటిల్ ఆవిష్కరణ పోస్టర్లు లో నాగచైతన్య మంచి మాస్ లుక్ లో అయితే కనిపిస్తున్నాడు. అటు నాగచైతన్య కూడా ఈ చిత్రంలో పాత్ర గురించి తెలిసిన తర్వాత చిత్రంలో నటించడానికి చాలా ఆసక్తిగా ఉన్నానంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో దుల్ల కొట్టేద్దాం అంటూ టైటిల్ ని ట్విట్ చేశారు. నాగచైతన్య 23వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. అలాగే ఇక ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ సమర్పకుడిగా, బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.