మంచు విష్ణు క్రేజీ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా నుంచి ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల అయింది. ఇక ఈరోజు మంచు విష్ణు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ తో సహా విడుదల చేశారు. శ్రీకాళహస్తిలో పూజ కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రం ప్రస్తుతం న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇక మంచు విష్ణు ఈ ఫస్ట్ లుక్ లో, ప్రకృతిలో వెలసిన శివలింగం ముందు ఆకాశం వైపు విల్లు ఎక్కు పెట్టి కన్నప్ప వేషధారణలోఅద్భుతమైన విజువల్స్ లో కనిపిస్తున్నాడు.
ఇక ఈ చిత్రం మంచు అభిమానులకు మంచి విజువల్ ట్రీట్ ఇస్తుంది అనేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో పలు భాషల నుండి స్టార్ హీరోలు నటిస్తూ ఉండటంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి. మలయాళ ఇండస్ట్రీ నుంచి మోహన్లాల్, అటు కన్నడ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరో శివరాజ్ కుమార్, ఇక తమిళం నుంచి నటుడు శరత్ కుమార్ వంటి వారు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇక వీటన్నిటికీ మించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శివుడిగా నటిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇక రచయితలు పరుచూరి గోపాలకృష్ణ మరియు తోట ప్రసాద్ వంటి వారు ఈ చిత్రానికి కథ సహకారం అందించగా, ఈ చిత్రాన్ని దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. స్టీఫెన్ దేవాసి మరియు మణిశర్మ వంటి వారు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై హీరో మోహన్ బాబు ఈ చిత్రాన్ని జాతీయస్థాయిలో నిర్మిస్తున్నారు.