సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన గత చిత్రం డీజే టిల్లు. యూత్ ఫుల్ మరియు కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం గత సంవత్సరంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. మరి ఇంత పెద్ద విజయాన్ని అందుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఈ చిత్రం గత నెల సెప్టెంబర్ 15న రిలీజ్ చేస్తారు అన్నట్లు ప్రచారం నడిచింది. కానీ ఆ తేదీకి ఈ సినిమా విడుదల కాలేదు. అయితే లేటెస్ట్ గా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే సంవత్సరం అంటే 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గత చిత్రం డీజే టిల్లు కూడా అదే ఫిబ్రవరి 12న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇదే సెంటిమెంటును ఫాలో అవుతూ ఈ చిత్రాన్ని కూడా ఫిబ్రవరిలోనే విడుదల చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, సంగీత దర్శకుడు రామ్ మిర్యాల ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు.