సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురు చూసిన చిత్రం టైగర్ 3 ఇక ఈ చిత్రం దీపావళి కానుకగా నిన్న ఆదివారం నాడు విడుదల అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక విడుదలైన థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.
మహారాష్ట్రలోని ఓ థియేటర్లో సల్మాన్ ఖాన్ అభిమానులు నానా రచ్చ రచ్చ చేశారు. మామూలుగా మనం సినిమాలలో హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు పూలు లేదా పేపర్లో చించి చల్లడం చూశాం కానీ, ఇక్కడ సల్మాన్ అభిమానులు ఏకంగా థియేటర్లో టపాసులు కాల్చారు. ఇక ప్రశాంతంగా సినిమా చూస్తున్న ప్రేక్షకులు అక్కడి చర్యతో ఏకంగా థియేటర్ నుండి బయటికి పరుగులు పెట్టారు. ఇలా థియేటర్లో టపాసులు కాల్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణ ప్రేక్షకులు సైతం ఇలాంటి చర్యలపై కోపం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లో మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు కూడా ఉండొచ్చు అలాంటివారికి ఇలాంటి పనుల వల్ల చాలా ఇబ్బంది కలిగి అవకాశం ఉంది అని ఇలాంటి పని చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఘటనపై తాజాగా హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు. టైగర్ 3 సినిమా థియేటర్లో టపాసులు కాల్చారని వార్తలు నేను చూశాను. సినిమాని సినిమా లాగా ఎంజాయ్ చేద్దాం అలాగే జాగ్రత్తగా ఉండండి. దయచేసి మనతోపాటు మన తోటి వారిని ఇబ్బందులకు గురి చేసే ఇలాంటి చర్యలు చేయొద్దు అని ఆయన ట్వీట్ చేశారు.