Salaar movie Review Chiranjeevi:
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నిన్న విడుదలైన చిత్రం సలార్ ఇక ఈ చిత్రం విడుదలైన అన్ని సెంటర్స్ లో సూపర్ హిట్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించే విధంగా పరుగు సాగిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కు ఇచ్చిన ఎలివేషన్లు ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఇక ఈ చిత్రంపై నిన్నటి నుంచి చాలామంది సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.. తాజాగా సలార్ చిత్రం చూసిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంపై స్పందించారు.
ఈ చిత్రంపై తన ట్విట్టర్ అకౌంట్లో స్పందిస్తూ ఈ విధంగా అన్నారు, మై డియర్ దేవా ప్రభాస్ మీకు అభినందనలు అని తెలుపుతూనే సలార్ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ల జోరు సాగిస్తున్నందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ గురించి స్పందిస్తూ చరిత్రలో ఒక మర్చిపోలేని కొత్త ప్రపంచాన్ని ఈ సలార్ చిత్రంతో సృష్టించినందుకు మీకు అభినందనలు అని ఆయనను మెచ్చుకున్నారు. అలాగే ఈ చిత్రంలో మరొక ప్రత్యేక పాత్రలో వరదరాజ మన్నారు అనే పాత్రలో నటించిన పృథ్వి రాజుకు, అలాగే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ కు అలాగే మరొక ప్రధాన పాత్రలో నటించిన జగపతిబాబు గారికి తన అభినందనలు తెలిపారు. ఇక ఈ చిత్రం సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కు అలాగే సంగీత దర్శకులకు మరియు ఈ చిత్రాన్ని నిర్మించిన నిర్మాణ సంస్థకు అందరికీ కూడా ఆయన ఈ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు.