గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ చంద్రముఖి. అయితే దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇదే చంద్రముఖికి సీక్వెల్ గా,హీరో రాఘవ లారెన్స్ మరియు కంగనా రనోత్ వంటి స్టార్ కాస్టింగ్ తో వచ్చిన చిత్రం చంద్రముఖి 2. హారర్ కామెడీ ప్రధాన బలంగా వచ్చిన ఈ చిత్రం గత నెలలో విడుదలయ్యింది. ఈ చిత్రంలో లారెన్స్ మరియు కంగనా నటన బాగా ఉన్నప్పటికీ, రజనీకాంత్ చంద్రముఖి చిత్రంతో పోల్చుకోవడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేకపోయింది. గతంలో విక్టరీ వెంకటేష్ తో ఇదే తరహా చిత్రం తీశారు దర్శకుడు పి వాసు, ఆ చిత్రం కూడా ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదు అయినా పట్టు వదలకుండా మళ్లీ చంద్రముఖి 2 అనే సీక్వెల్ తీశారు దర్శకుడు పీ. వాసు. ఇక అసలు విషయం ఏంటంటే థియేటర్లో మెప్పించ లేకపోయినా ఈ చిత్రం ఈరోజు నుంచి నెట్ఫ్లిక్స్ అనే OTT లో ప్రసారమవుతుంది. తమిళంతో పాటు తెలుగు హిందీ మరియు ప్రధాన భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉన్నది. ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ వారు నిర్మించారు.. ఇక థియేటర్లో చూడని వారు OTT ఓ లుక్కేయండి.