Kalki 2898AD : సంక్రాంతి సినిమాల జోరు తర్వాత సరైన చిత్రం లేక థియేటర్లు వెలవెలబోతున్న తరుణంలో సరిగ్గా జూన్ 27వ తేదీ థియేటర్లలోకి దిగింది ప్రభాస్ నటించిన కల్కి చిత్రం. ఇక ఈ చిత్రం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా మహామహులు అయినటువంటి అమితాబచ్చన్, కమల్ హాసన్ మరియు దీపిక పదుకొనే వంటి వారు ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రం నార్త్ మరియు సౌత్ అనే తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపించింది.
చాలా రోజుల తర్వాత చిత్రసీమలో 50 రోజులు ఆడిన చిత్రంగా ప్రభాస్ కల్కి చిత్రం నిలిచింది. ఇక అసలు విషయం ఏమిటి అంటే ఈరోజు అమెజాన్ ప్రైమ్ “కల్కి’ చిత్రం OTT రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించింది.
కల్కి 2898AD సినిమా ఈ ఆగస్టు 22వ తేదీ నుంచి OTT లో స్ట్రీమింగ్ అవ్వనుంది . కల్కి సినిమా హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్ లో ప్రసారం కానుంది. అలాగే తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం వర్షన్స్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం కానున్నాయి. ఇక అదే రోజు థియేటర్లలో చిరంజీవి నటించిన ఇంద్ర చిత్రం రీ- రిలీజ్ అవుతూ ఉండగా ఇటు OTT లో మాత్రం ప్రభాస్ నటించిన కల్కి విడుదలవుతూ ఉంది.