Mangalavaram OTT:
అజయ్ భూపతి దర్శకత్వంలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ హార్రర్ చిత్రం మంగళవారం. మొదట్లో ఏమాత్రం అంచనాలు లేని ఈ చిత్రం టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే విడుదలైన తర్వాత ఈ చిత్రం అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని సూపర్ హిట్టుగా ఈ సంవత్సరం నిలిచింది. ఈ సంవత్సరం చాలావరకు చిన్న చిత్రాలు మంచి విజయాలు నమోదు చేశాయి. అందులో ఈ మంగళవారం చిత్రం కూడా ఒకటిగా ఉంది.
ఇక నవంబర్ 17వ తేదీ థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం ఇప్పుడు OTT స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అంటే డిసెంబర్ 26వ తేదీ మంగళవారం రోజు ఈ చిత్రాన్ని ఓటిటిలో స్ట్రీమింగ్ కు తీసుకొని వచ్చారు. డిస్నీ + HOTSTAR లో , ఈ చిత్రం ఈ అర్ధరాత్రి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు అన్ని ప్రధాన భాషలలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్సయిన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఇప్పుడుOTT లో వీక్షించవచ్చు..