kalyan ram devil movie trailer: టాలీవుడ్ లో వైవిద్య భరితమైన చిత్రాలలో నటించిమెప్పించగల హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది నందమూరి కళ్యాణ్ రామ్. ఇక ఆయన నటించే చిత్రాలు ఒకదానికొకటి ఏమాత్రం సంబంధం లేకుండా జాగ్రత్త పడుతుంటారు. మరి అలాంటి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా, సక్సెస్ఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ జంటగా తెరకెక్కుతున్న కొత్త చిత్రం డెవిల్. ఇక ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్ బ్యానర్ నిర్మిస్తూ ఉండగా, ఈ చిత్రానికి అటు నిర్మాత మరియు దర్శకుడిగా అభిషేక్ నామ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఇక గతంలో విడుదలైన కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్ టీజర్ మరోసారి కళ్యాణ్ రామ్ కు హిట్ సినిమా అందించే విధంగా ఉండగా, అటు విడుదలైన పాటలు మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇక డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనే సరికొత్త టైటిల్ తో వస్తున్న ఈ చిత్రం ఈనెల డిసెంబర్ 12వ తేదీ సినిమా థియేటర్ ట్రైలర్ను విడుదల చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇక హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నఈ చిత్రం, క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కానుకగా డిసెంబర్ 29న విడుదల అవబోతుంది.