Kalki 2898 AD Box Office Collection Day 1: కల్కి AD 2898 మొదటి రోజు కలెక్షన్స్ …

image KALKI AD 2898 BOX OFFICE COLLECTIONS

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం కల్కి 2898 AD. ఇక ఈ చిత్రం జూన్ 27వ తేదీ విడుదలైన సంగతి తెలిసిందే. విపరీతమైన అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ఊహించని కలెక్షన్స్ అయితే సాధించింది. ఇక భారి బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం అన్ని భాషలలో కలిపి దాదాపు 95 కోట్ల NET కలెక్షన్లను సాధించింది.

ఈ చిత్రం హిందీలో దాదాపు 24 కోట్లు, తెలుగులో 61 ఒక్క కోట్లు, తమిళ్ లో 4.5 కోట్లు మరియు మలయాళంలో చూసినట్లయితే 2.2 కోట్లు అయితే ఈ చిత్రం సాధించింది. ఇక నిన్న నిర్మాతలు అధికారికంగా విడుదల చేసిన పోస్టర్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు 193 కోట్ల పైన సాధించింది అని వారు ప్రకటించారు.

సైంటిఫిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో దాదాపు అన్ని భాషల నుండి పెద్దపెద్ద నటీనటీలు ఇందులో నటించారు. ప్రధానంగా అమితాబచ్చన్ ,దీపికా పదుకొనే, దిశాపటాని అలాగే కమల్ హాసన్ వంటి నటులు చిత్రంలో నటించడం వల్ల ఈ చిత్రానికి విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రం మొదటి రోజు వసూళ్ల ప్రభంజనం సృష్టించింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *