కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ హీరోగా, ఎంజి శ్రీనివాస్ దర్శకత్వంలో అనుపమ్ కేర్ ,జయరాం, సత్య ప్రకాష్ వంటి నటీనటులతో రూపొందించిన చిత్రం గోస్ట్. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19న కన్నడలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో నవంబర్ 4 న విడుదలైన ఈ చిత్రం తాజాగా ott రిలీజ్ డేట్ ను ఖాయం చేసుకుంది. రజినీకాంత్ హీరోగా వచ్చిన జైలర్ చిత్రంలో మంచి రోల్ కాసేపు లో కనిపించి ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించారు.
దర్శకుడు,mg శ్రీనివాస్ నటుడిగా మరియు దర్శకునిగా తీసిన చిత్రం బీర్బల్, ఈ చిత్రం 2019లో కన్నడలో విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత, హీరో శివరాజ్ కుమార్ తో తీసిన ఘోస్ట్ చిత్రం కన్నడలో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తెలుగులో మిశ్రమ స్పందన తెచ్చుకున్నప్పటికీ మాస్ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగానే నచ్చుతుంది. అయితే ఇక ఈ చిత్రం ott ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. నవంబర్ 17వ తేదీ ott ప్లాట్ఫామ్ అయినా ZEE5 స్త్రేమింగ్ కానుంది.