Double Ismart: ఫస్ట్ డే కలెక్షన్స్

ismart edited

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా అలాగే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇక ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న విడుదల అయిన సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయం సాధించడంతో అభిమానులకి ఈ చిత్రంపై విపరీత అంచనాలు పెరిగిపోయాయి.

అయితే అనూహ్యంగా ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుండి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. చిత్రంలో కొన్ని డబల్ మీనింగ్ డైలాగులు ఎక్కువ అయ్యాయి అని తర్వాత సెపరేట్గా తీసిన అలీ కామెడీ ట్రాక్ కూడా చాలా విసిగించింది అని పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు.

సినిమా హిట్టు ఫ్లాపు అనే సంబంధం లేకుండా పూరి జగన్నాథ్ సినిమాలకు మొదటి రోజు మంచి కలెక్షన్లు వస్తాయి. యూత్లో ఆయన సినిమాలకు ఇంకా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నా కూడా రామ్ ఎనర్జిటిక్ యాక్షన్ సన్నివేశాలు మరియు యూత్ లో పూరీకి ఉన్న craze వల్ల చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 12.45 కోట్లు వసూలు చేసింది .మొదటి రోజు కలెక్షన్స్ పూరి , తన సోషల్ మీడియా అకౌంట్లో అధికారికంగా ప్రకటించాడు. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, హీరోయిన్గా కావ్య థాపర్ నటించారు అలాగే ఈ చిత్రాన్ని పూరి మరియు చార్మి నిర్మాణ సారద్యం లో తెరకెక్కించారు ..

Leave a Comment