నాగచైతన్య మొట్టమొదటిసారిగా హీరోగా నటించిన వెబ్ సిరీస్ దూత. గతంలో విడుదలైన నాగచైతన్య దూత వెబ్ సిరీస్ లుక్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా చూద్దాము అని ఎదురుచూసిన ఈ వెబ్ సిరీస్, చాలా కాలం కిందటే షూటింగ్ పూర్తి అయినప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఎట్టకేలకు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా, ఈ వెబ్ సిరీస్ రిలీజ్ తేదీతో పాటు ఈరోజు ట్రైలర్ కూడా విడుదల చేశారు. గతంలో నాగచైతన్య, నాగార్జునతో కలిసి మనం లాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని అందించిన విక్రమ్ కే కుమార్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ట్రైలర్ చూస్తే 138 కోట్ల భారతీయులను రక్షిస్తున్న జ్యుడీషియల్ ,రాజకీయ నాయకులు అలాగే పోలీసు వాళ్ళు తప్పు చేస్తే ప్రశ్నించేది ఎవరు జర్నలిస్ట్ వంటి డైలాగ్స్ తో మొదలుపెట్టి చివరి వరకు ట్రైలర్ ఉత్కంఠ భరితంగా సాగింది. త్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్ర ట్రైలర్ కచ్చితంగా సినీ అభిమానులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ ఒకటో తేదీ నాడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది. మొత్తంగా 8 ఎపిసోడ్స్ తో 40 నిమిషాల రన్ టైం తో వివిధ భాషలలో వెబ్ సిరీస్ విడుదల కానున్నది అని సమాచారం. అటు నిన్న విడుదలైన నాగచైతన్య 23వ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్, అలాగే ఈరోజు విడుదలైన దూత ట్రైలర్ విడుదల చేయడంతో అక్కినేని అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.