వావ్ అనిపించేలా చిరు కొత్త లుక్

CHIRANJEEVI NEW LOOK

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత చేసిన భోళాశంకర్ సినిమా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ తన 156 వ చిత్రాన్ని బింబిసారా ఫేమ్ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ వారి నిర్మాణ సారథ్యంలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా సోషల్ మీడియా అకౌంట్ ‘X’ లో తన ప్రొఫైల్ పిక్చర్ మార్చారు ఇక తాజా ఆ ప్రొఫైల్ పిక్చర్ లో మెగాస్టార్ గోధుమరంగు షర్ట్, కొత్త హెయిర్ స్టైల్ మరియు స్టైలిష్ గ్లాసెస్ తో, యంగ్ హీరోలకు ఏమాత్రం తీసుకొని విధంగా తన లుక్ తో మెస్మరైజ్ చేశారు. ఇక ఈ ఫోటో తర్వాత మెగాస్టార్ ఫ్యాన్స్ చిరంజీవి గత దశాబ్దం కిందటి సినిమాలలో కనిపించిన విధంగా మరింత యంగ్ కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మేకోవర్ ప్రస్తుతం పరిశీలనలో ఉన్న టైటిల్, మరియు తొందరలో సెట్స్ మీదకు వెళ్ళబోయే చిత్రం విశ్వంభరా కోసమేనని అభిమానులు చర్చించుకుంటున్నారు. చిరంజీవి వంటి స్టార్ హీరోకి బింబిసార వంటి బ్లాక్ బస్టర్ తీసిన దర్శకుడు తోడు కావడంతో ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై భారీ అంచనాలైతే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *