ఆర్ఎక్స్ 100 చిత్రం తో తెలుగు సినీ చిత్ర పరిశ్రమ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. యువి క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో, యువి కాన్సెప్ట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం భజే వాయు వేగం. ఈ చిత్రంలో హీరో కార్తికేయ నటిస్తున్నాడు. అయితే ఇటీవల ఈ చిత్ర నిర్మాతలు అధికారికంగా చిత్రం థియేటర్లలో విడుదల అవ్వబోయే తేదీని ప్రకటించారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈనెల మే 31వ తేదీ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇక ఈ చిత్రంలో హీరో కార్తికేయ కు జోడిగా హీరోయిన్గా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి.
ఇక ఈ చిత్రం గురువారం నాడు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు, ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ “సెట్ అయ్యింది” అనే పాటను నిర్మాతలు విడుదల చేస్తున్నారు. ఇక ఈ పాటకు సంబంధించి ముందు రిలీజ్ చేసిన ప్రోమో కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రంలో ప్రధాన నటులు నటిస్తూ ఉండడంతో పాటు ఈ చిత్రానికి రాదన్ సంగీతం అందిస్తున్నాడు..