దేవర పై ఆసక్తిని పెంచుతున్న అనిరుద్ మాటలు

ANIRUDH ABOUT DEVARA MOVIE
file source (X)

గతవారం నుంచి విపరీతంగా ట్రెండింగ్ లో ఉన్న విషయం ఏది అంటే అది దేవర చిత్రం అనే చెప్పాలి. ఒకవైపు ట్రైలర్లు మరోవైపు పాటలు అలాగే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ వంటి విషయాలతో పాటు బుక్ మై షో లో టికెట్లు ఓపెన్ చేసిన దగ్గర నుండి విపరీతంగా ట్రెండింగ్ లో దేవర చిత్రం కొన సాగుతోంది.

అయితే ఎక్కడెక్కడో నుంచి వచ్చిన ఫ్యాన్స్ కు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అవ్వడం చాలా నిరాశకు గురి చేసిందని చెప్పాలి. తన అభిమాన హీరోని ఆరు సంవత్సరాలుగా చూడాలి అని ఎదురుచూసిన అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది.

దాంతో నిరాశలో ఉన్న అభిమానులకు ఉత్సాహం నింపేలా, ఇటీవల కొరటాల శివ అండ్ యూనిట్ ఒక ఇంటర్వ్యూ అయితే నిర్వహించారు. దేవర గురించి మాట్లాడుతూ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఈ చిత్రంపై అద్భుతమైన ప్రశంసలు కురిపించాడు. ఈ చిత్రానికి పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలుపుతూ, ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ని ప్రేక్షకులు అనుభూతి చెందుతారని ఈ చిత్రంపై హైప్ మరింత ఎక్కించాడు. ఇంకా చెప్పాలి అంటే ఈ చిత్రం చూస్తున్నప్పుడు బ్యాట్ మాన్ వంటి హాలీవుడ్ సినిమాల అనుభూతిని ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేస్తారని తన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కచ్చితంగా ఈ చిత్రంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉండే ఉంటుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. దేవర

అయితే ఈ చిత్రాన్ని తను మొదటి రోజు, మొదటి షోను చూడాలని అనుకుంటున్నాను అని చెప్పాడు, అలాగే ఈ చిత్రాన్ని అభిమానులతో కలిసి ఎంజాయ్ చేస్తానని కూడా చెప్పాడు.

జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా, ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటించాడు. అలాగే ఈ చిత్రానికి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ఉన్నారు. ఆచార్య చిత్రం తర్వాత అపకీర్తి మూట కట్టుకున్న కొరటాల శివ ఈ దేవర చిత్రంతో తానేంటో నిరూపించుకోవాలని ఒకవైపు, ఎన్టీఆర్ కూడా రాజమౌళి హిట్ చిత్రాల తర్వాత ఫ్లాప్ అనే సెంటిమెంట్ ను బ్రేక్ చేసి తన హిట్టుల పరంపర కొనసాగించాలని ఒకవైపు, అటు కళ్యాణ్ రామ్ కూడా తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో ఓ భారీ హిట్ ను అందించాలని ఒకవైపు, ఆరు సంవత్సరాల తర్వాత వస్తున్న తమ హీరోకు ఓ భారీ విజయం అందించేందుకు ఎదురుచూస్తున్న అభిమానులు ఒకవైపు, వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే సెప్టెంబర్ 27 వరకు ఆగాల్సిందే.

Leave a Comment