టాలీవుడ్ హీరోయిన్ అంజలి మెయిన్ హీరోయిన్ గా అలాగే కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మరియు షకలక శంకర్ వంటి నటులు నటించిన గీతాంజలి చిత్రం కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయ్యి ఒక మోస్తరు విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఇలాంటి కామెడీ హర్రర్ చిత్రాలకు ఎప్పుడు ఆదరణ ఉంటుంది. ఇక తాజాగా ఈ చిత్రానికి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది , అంటూ ఇంకో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించారు. ఈ చిత్రంలో కూడా అంజలి ప్రధాన పాత్ర లో నటిస్తూనే ఇంకొందరు నటీనటులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అందులో ప్రముఖంగా సునీల్ మరియు సత్య వంటి కమెడియన్లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఇక ఈమధ్య సినిమాలు పూర్తిచేసి విడుదల చేయడం కంటే కూడా సినిమాని జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి వివిధ మార్గాల్లో ప్రమోషన్స్ దర్శక నిర్మాతలు అవలంబిస్తున్నారు. గీతాంజలి చిత్ర టీం కూడా వినూత్నంగా ఆలోచించి ఈ చిత్ర టీజర్‌ను బేగంపేట స్మశాన వాటికలో టీజర్ లాంచ్ చేయడానికి నిర్ణయించారు. ఇక ఈ చిత్ర టీజర్ శనివారం ఫిబ్రవరి 24వ తేదీ రాత్రి 7 గంటలకు స్మశాన వాటికలు టీజర్ విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రానికి శివ తుర్లపాటి దర్శకత్వం వహించగా ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. అలాగే కోన వెంకట్ సమర్పణలు ఈ చిత్రం తెరకెక్కుతున్నది..