నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ ఫామ్ లో ఉన్న హీరో, అఖండ మరియు వీరసింహారెడ్డి ల తరువాత 100 కోట్ల మార్కు అందుకున్న మూడవ చిత్రం భగవంతు కేసరి. ముచ్చటగా మూడోసారి బాలయ్య తన అసలైన స్టామినా చూపించారని చెప్పాలి. మంచి కథ పడితే బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద చేసే గర్జన మామూలుగా ఉండదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. భగవంత్ కేసరికి ఫ్యామిలీ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మరి ఇంతటి ఘన విజయం సాధించిన ఈ చిత్రానికి ఈరోజు నుండి ఈ చిత్ర యూనిట్ టూర్ ప్రారంభించింది. మరి చిత్ర యూనిట్ సందర్శించే ప్రదేశాల గురించి వివరాలు ఇలా…
27th అక్టోబర్
వైజాగ్ – melody theatre- morning show
రాజమండ్రీ – Sai Krishna theatre-matnee show
ఏలూరు – Sri Satyanarayana theatre-first show
విజయవాడ – Alankar theatre-second show
28th అక్టోబర్ నాడు విజయవాడలో దుర్గమ్మ టెంపుల్ సందర్శించిన తర్వాత, గుంటూరులో మార్నింగ్ షో అలాగే ఒంగోలులో మ్యాట్నీ షో తర్వాత నెల్లూరులో ఫస్ట్ షో చివరగా కడపనందు సెకండ్ షోలు చిత్ర యూనిట్ సందర్శిస్తారు.
ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా,కాజల్ హీరోయిన్గా అలాగే ప్రధాన పాత్రలో శ్రీలీల నటించారు.