బాలకృష్ణ పేరు వినగానే మనకు మొదటిగా గుర్తించేది మాస్ ఫైట్లు, అదిరిపోయే పాటలు అలాగే పవర్ఫుల్ డైలాగులు. అయితే మొదటిసారి వీటన్నిటికీ దూరంగా జరిగి నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కాజల్ హీరోయిన్గా అలాగే మరో ప్రధాన పాత్రలో శ్రీ లీల నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేస్తోంది. అయితే గత కొంతకాలంగా హిట్లు లేని బాలకృష్ణ గతంలో విడుదలైన అఖండ సినిమా నుంచి తన రేంజ్ ఏమిటో బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తూ వస్తున్నారు. గతంలో విడుదలైన అఖండ 100 కోట్లు దాటి సంచలనం సృష్టించగా దానికి ఏమాత్రం తీసుకొని విధంగా వీరసింహారెడ్డి కూడా 100 కోట్లు ఈజీగా దాటేసింది. ఇక ముచ్చటగా మూడోసారి 100 కోట్ల క్లబ్ లో భగవంతు కేసరి కూడా చేరిపోయింది. ఇక విజయవంతంగా రెండవ వారంలోకి ప్రవేశించిన భగవంత్ కేసరి ఎలాంటి కలెక్షన్ నమోదు చేస్తుందో చూడాలి.తమన్ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం కాగా, బాలకృష్ణతో తమన్ కి ఇది మూడవ హ్యాట్రిక్ హిట్ చిత్రం. వరుసగా మూడుసార్లు 100 కోట్లు దాటిన హీరోగా బాలకృష్ణ సంచలనం సృష్టించారు. దీంతో నందమూరి బాలకృష్ణను బాక్సాఫీస్ బొనాంజా అని ఊరికే అనలేదు అని నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..