నాచురల్ స్టార్ నాని హీరోగా మరియు మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన కొత్త చిత్రం హాయ్ నాన్న. సౌర్యువ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ సూపర్ హిట్ దిశగా సాగుతోంది. అయితే ఈ చిత్రాన్ని తాజాగా వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల జల్లు కురిపించారు. హాయ్ నాన్న చిత్రాన్ని ఇటీవలే చూశానని ఇక ఈ చిత్రంలో హీరోగా నటించిన నాని తన నటనతో అద్భుతంగా ఆకట్టుకున్నారని కొనియాడారు.
అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి చెప్తూ తాను నటించిన ప్రతి సీన్ చాలా అద్భుతంగా ఉంది అని నిజం చెప్పాలంటే ఆమె లాగే చాలా అందంగా ఉందని పొగిడారు. ఇక మరో అద్భుత పాత్రలో నటించిన బేబీ కీయరా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులని మంత్ర ముగ్దులను చేసిందని కొనియాడారు. అలాగే ఈ చిత్రంలో నటించిన ప్రతి నటీనటులకు అలాగే టెక్నీషియన్లకు ఆయన అభినందనలు తెలిపారు. ఇక దర్శకుడు గురించి చెప్తూ తన తొలి చిత్రంతోనే అందరిని మెప్పించాడని అలాగే ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకే విధంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడని చెప్తూనే ఆయనకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకున్నారు. ఇక ఇంతటి మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించినటువంటి నిర్మాతలకు అభినందనలు తెలిపారు. హాయ్ నాన్న చిత్రం కేవలం నాన్నలను మాత్రమే కాదు కుటుంబంలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఉందని ఆయన ప్రశంసించారు.