నటుడు సోనూసూద్ , సంవత్సరాలుఈ పేరు వినగానే మనకు మూడు సంవత్సరాల కిందట కరోనా సమయంలో పేదలకు ఎంతగానో సహాయం చేసి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సోనూసూద్ గుర్తుకు వస్తారు. తాజాగా హైదరాబాద్ వీధుల్లో ఫుడ్ స్టాల్ నడుపుతూ సోషల్ మీడియాలో ఎంతగానో పాపులారిటీ సంపాదించుకున్న కుమారి ఆంటీ ఫుడ్ కోర్టు దగ్గర సందడి చేశారు.
ఇక కుమారి ఆంటీ ని చూసిన తర్వాత మహిళా సాధికారిక శక్తి కి నిజమైన అర్థం ఈమె అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. కుటుంబాల కోసం స్త్రీలు ఈ రోజుల్లో ఎంత కష్టపడుతున్నారో తనకు కుమారి ఆంటీ ని చూసినప్పుడు బాగా అర్థమైంది అని ఆయన తెలిపాడు. ఇక కుమారి ఆంటీ కి సోనూసూద్ ను కలిసిన తర్వాత ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
కుమారి ఆంటీ ని ఇక్కడ మీ మీ దగ్గర ఏమేమి ఉంటాయి అని అడగగా ,కుమారి వెజిటేరియన్ మీల్స్ అలాగే నాన్ వెజిటేరియన్ మీల్స్ అమ్ముతారని చెప్పింది. వాటి ధరలు అడగగా కుమారి ఆంటీ వెజ్ అయితే 80 రూపాయలు నాన్ వెజ్ అయితే 120 రూపాయలు అని సమాధానం తెలిపింది. అయితే సోను సూద్ నాన్ వెజ్ తినను అని నేను కేవలం వెజిటేరియన్ మాత్రమే అని తెలిపారు’
అయితే నేను ఇక్కడ భోజనం చేస్తే నాకు ఎంత డిస్కౌంట్ ఇస్తావు అని కుమారి ఆంటీ ని సోను సూద్ అడగగా ,ఆమె నవ్వుతూ నేను మీకు డిస్కౌంట్ ఇవ్వను కానీ పూర్తిగా ఈరోజు భోజనం ఫ్రీగా పెడతాను అని చెప్పింది. దానికి సోనూసూద్ నవ్వుతూ ఫ్రీగా పెడితే నేను ప్రతిరోజు వచ్చి మీ దగ్గర భోజనం చేస్తానని బదులు ఇచ్చాడు.
ఇక కుమారి ఆంటీ కూడా మీరు కరోనాకాలంలో ఎంతోమందికి సేవ చేశారు ఆ సేవతో పోల్చుకుంటే నేను మీకు భోజనం పెట్టేది చాలా తక్కువ అని ఆయనను ప్రశంసించారు. తర్వాత సోనూసూద్ కుమారి ఆంటీ ని ,ఒక శాలువాతో సత్కరించి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో తన సోషల్ మీడియా ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.