మంచి ప్రతిభగల డైరెక్టర్ మరియు మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన చిత్రం కుబేర. ఇక ఈ చిత్రంలో మన టాలీవుడ్ నుంచి అక్కినేని నాగార్జున ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా నటిస్తోంది.
ఇక పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రూపు దిద్దుకుంటుండగా , ఈ చిత్రంపై సినీ అభిమానుల్లో విపరీత అంచనాలు ఉన్నాయి. ఇక గతంలో విడుదల చేసిన హీరో ధనుష్ అలాగే నాగార్జున ఫస్ట్ లుక్ లకి మంచి స్పందన అయితే వచ్చింది.. ఇక ఈరోజు రష్మికకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా నిర్మాతలు విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మరియు అమిగోస్ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక విడుదల అయిన గ్లిమ్ప్స్ చూసుకుంటే అందులో ఎవరూ లేని ద ట్టమైన అడవి ప్రాంతంలో రష్మిక ఒక పాతిపెట్టిన సూట్ కేసు అయితే గొయ్యి తవ్వి బయటికి తీస్తుంది. అలా తీసిన సూట్ కేస్ నిండా డబ్బు కూడా ఉంటుంది.