మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న చిత్రం గుంటూరు కారం. ఇక ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అయితే వారి నిరీక్షణకు తెరదించేలా గత నెలలో మొదటి పాట విడుదల చేశారు. ఇక అక్కడనుండి ఈ చిత్రంపై ఏదో ఒక అప్డేట్ తరచుగా వస్తూనే ఉంది. ఇక దం మసాలా అంటూ సాగే మొదటి పాట మంచి ఆదరణ దక్కించుకుంది.
అయితే ఇక తాజా విశేషం ఏమిటి అంటే ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి రెండో పాట అప్డేట్ ను అందించారు. ఓ మై బేబీ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ని ఈనెల 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు, పూర్తి పాట ను డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో విడుదలైన పోస్టర్లు అన్ని మహేష్ మాస్ లుక్కుతో కనిపించగా ఈసారి మాత్రం రొమాంటిక్ లుక్ తో మహేష్ కు శ్రీ లీల ముద్దు పెడుతున్నట్టు ఈ పోస్టర్ విడుదల చేశారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 సంవత్సరం జనవరి 12న అత్యంత భారీ స్థాయిలో విడుదల అవబోతోంది.