యువ సామ్రాట్ నాగచైతన్య అక్కినేని హీరోగా మరియు కార్తికేయ 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించిన చందు మొండేటి దర్శకుడుగా అలాగే సాయి పల్లవి హీరోయిన్ గా సక్సెస్ఫుల్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం తండేల్. ఇక నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టులకు మంచి స్పందన వచ్చింది. ఇక ఈ చిత్రం యొక్క ప్రారంభోత్సవం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.
ఇక ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా విక్టరీ వెంకటేష్ మరియు కింగ్ నాగార్జున విచ్చేశారు. ఇక వీళ్ళు ముగ్గురు కలిసి దిగిన ఒక ఫోటో అక్కినేని అభిమానులు, అటు వెంకీ అభిమానులు ను విపరీతంగా ఆకట్టు కొంటోంది.ఇక అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ గీత ఆర్ట్స్ బ్యానర్లో ఈ చిత్రం చేయడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. తన కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం 100% లవ్ వంటి చిత్రాలను గీత ఆర్ట్స్ బ్యానర్ లోనే చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. లవ్ స్టోరీ వంటి హిట్ చిత్రంలో నటించిన సాయి పల్లవి తో మరోసారి నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే దర్శకుడు చందు మొండేటి, తనకు మంచి స్నేహం ఉందని తెలిపారు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో గతంలో హిట్ చిత్రాలైన ప్రేమం మరియు సవ్యసాచి వంటి చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక వీళ్లిద్దరికి ఇది మూడో చిత్రం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ మొదలవబోతోంది.