ఈ శుక్రవారం మరొక్కసారి పోయిన దసరా పండుగకు నెలకొన్న సినిమా వాతావరణం మళ్లీ రానున్నది. గత నెల అక్టోబర్ 19 తేదీ ఒకేరోజు థియేటర్లో పోటీపడ్డ బాలకృష్ణ భగవంతు కేసరి మరియు విజయ్ నటించిన లియో సినిమా లు విడుదలయ్యాయి. అయితే ఈ రెండు చిత్రాలు మరోసారి ఒకే రోజు పోటీ పడబోతున్నాయి. కానీ ఈసారి థియేటర్లలో మాత్రం కాదు, OTT లో. ఇక నటసింహ బాలకృష్ణ హీరోగా, కాజల్ హీరోయిన్ గా మరియు శ్రీ లీల ఒక ప్రధాన పాత్రలో యాక్షన్ మరియు సెంటిమెంట్ కలగలిపిన ఈ చిత్రం గత నెల అక్టోబర్ 19న విడుదల అయింది. మంచి పోటీలో విడుదలైన ఈ చిత్రం మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తో కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. గుడ్ టచ్ ,బాడ్ టచ్ వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రానికి మహిళా లోకం ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పట్టడంతో పండుగ సినిమాల పోటీలో విజేతగా నిలిచింది. అలాగే బాలకృష్ణ యాక్షన్ మరియు శ్రీ లీల నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇక ఈ చిత్రానికి వరుసగా మూడోసారి తమన్ సంగీతం అందించారు. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రం ఈ శుక్రవారం నవంబర్ 24 తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక తమిళ స్టార్ హీరో విజయ్ మరియు త్రిష హీరోయిన్ గా, ఖైదీ మరియు విక్రమ్ వంటి వరుసబ్లాక్ బాస్టర్ల తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం లియో. ఇక ఈ చిత్రం కూడా అక్టోబర్ 19 నాడే మంచి పోటీలో విడుదల అయింది. ఇక మొదటిరోజు ఈ చిత్రానికి యూత్ ఎగబడడంతో మంచి కలెక్షన్లు తెలుగులో కూడా నమోదు చేసింది. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ఈ చిత్రం దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించారు. అయితే ఈ చిత్రం కూడా ఈ శుక్రవారం నవంబర్ 24వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవనుంది.
ఇక ఇదే నవంబర్ 24వ తేదీ నుండి ఆహా OTTప్లాట్ఫారంలో బాలకృష్ణ సీజన్ 3 అన్ స్టాపబుల్ యానిమల్ చిత్ర యూనిట్ సందడి చేయనుంది. బాలకృష్ణ అభిమానులకు డబుల్ ధమాకా అన్నమాట.