రిలయన్స్ జియో, జియో 5జి వైర్లెస్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు ఇప్పుడు ఇంకో 115 నగరాలలో విస్తరించాయి. ఈ సేవలు మొదటగా సెప్టెంబర్ 2023లో ప్రారంభం అయ్యాయి. అయితే అప్పుడు కేవలం కొన్ని నగరాలకు మాత్రమే పరిమితం అయిన సేవలు ఇప్పుడు మరికొన్ని నగరాలకు కూడా విస్తరించాయి. మొదట్లో ఈ సేవలు ముంబై, కోల్కత్తా ఢిల్లీ ,చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ ,బెంగళూరు ,పూణే వంటి ఎనిమిది మెట్రో నగరాల్లో మాత్రమే ప్రారంభం అయ్యాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలలో జియో airfiber లభించే పట్టణాలు.
తెలంగాణ:
హైదరాబాదు, ఆర్మూరు, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్నగర్, మంచిర్యాల, మిర్యాలగూడ, నిర్మల్, నిజామాబాద్, పాల్వంచ, పెద్దపల్లి, రామగుండం, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, తాండూరు ,వరంగల్.
ఆంధ్ర ప్రదేశ్:
అనంతపురం, కడప, గుంటూరు, కాకినాడ ,కర్నూల్ ,నెల్లూరు, ఒంగోలు ,రాజమండ్రి ,తిరుపతి, విజయవాడ విశాఖపట్నం, విజయనగరం.
ఎయిర్ ఫైబర్ ప్లాన్లు:
మొదటి ప్లాన్ ధర 599 నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత రూ 899 మరియు 1119 వంటి ప్లాన్లు ఉన్నాయి’
ఇంటర్నెట్ స్పీడు 100 ఎంబిబిఎస్ వరకు ఉంటుంది
ఈ ప్లాన్లు తీసుకుంటే 550 పైగా డిజిటల్ ఛానల్ లో మరియు 14 ఓ టి టి యాప్ లను యాక్సెస్ పొందవచ్చు.
ఇక రూ 1199 ప్లాన్ లో మనకి నెట్ ఫిక్స్ అమెజాన్ ప్రైమ్ మరియు జియో సినిమా ప్రీమియం వంటి కాంప్లిమెంటరీ సుబ్స్క్రిప్షన్ కూడా పొందవచ్చు
ఎయిర్ ఫైబర్ మాక్స్ ప్లాన్లు ధరలు ఇవే:
ఎయిట్ ఫైబర్ మాక్స్ ప్లాన్ లో ధరలు ఇవే, మొదటగా ఈ ప్లాన్ ధర రూ 1499 ప్రారంభం అవుతుంది, తరువాత రూ 2499 మరియు రూ3999 వంటి మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ ప్లాన్లు చూసుకుంటే స్పీడు దాదాపు వన్ జీబీపీఎస్ వరకు ఉంటుంది. అలాగే నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ జియో సినిమా ప్రీమియం తో పాటు 550 డిజిటల్ ఛానల్ మరియు 14 ఓటీపీ ఆప్ లకు యాక్సిస్ అయితే పొందవచ్చు.
ఇక 2023 చివరి నాటికి మరికొన్ని నగరాలకు ఈ జియో ఎయిర్ఫైబర్ ను విస్తరించే ఆలోచనలు ఉంది జియో సంస్థ.