Iinsipiration telugu story
ఒకసారి ఒక చిన్న పాఠశాలలో ఒక మాస్టారు,తన యొక్క విద్యార్థుల ముందుకు వచ్చి ఒక 100 రూపాయల నోటు తో నిలబడి ఉన్నాడు.
మాస్టారు ఆ పిల్లలతో ఈ విధంగా అడిగాడు మీలో ఈ డబ్బు ఎవరికి కావాలి అని. అప్పుడు ఆ గదిలో ఉన్న ప్రతి చెయ్యి పైకి లేచింది. మాస్టారు నవ్వుకొని ఈ డబ్బు ఇక్కడ ఎవరికైనా ఖచ్చితంగా ఇస్తాను. అయితే అంతకుముందు మనం ఒక పని చేద్దామని విద్యార్థులతో అన్నాడు.
మాస్టారు ఆ నోటు చేతిలోకి తీసుకొని బాగా నలిపి ఇప్పుడు, ఈ నోటు ఎవరికి కావాలి అని మళ్లీ అడిగాడు. ఆశ్చర్యకరంగా చేతులు అన్నీ మళ్ళీ లేచి నిలబడి పోయాయి. ఈసారి మాస్టారు ఆ వంద రూపాయల నోటును నేలపై పడివేసి మురికిగా మరియు మరింత నలిగేలా చేశాడు. ఇప్పుడు ఇది చాలా మురికిగా ఉంది.ఇప్పుడు ఇది ఎంతమందికి కావాలి అని మళ్లీ తన విద్యార్థులను అడిగాడు. ఆశ్చర్యకంగా మళ్లీ అన్ని చేతులు పైకి లేచి నిలబడి పోయాయి.
అప్పుడు ఆ మాస్టారు చిరునవ్వుతో నా,ప్రియమైన విద్యార్థులారా మీరు ఇక్కడ నేను చెప్పిన పాఠాన్ని బాగా అర్థం చేసుకున్నారని నాకు అర్థం అయింది. ఈ డబ్బును నేను ఏమి చేసినా పర్వాలేదు, దాని విలువ అలాగే ఉంది కాబట్టే, మీరు ఇంకా ఈ డబ్బులు కోరుకుంటున్నారు. అది ముడతలు పడిన, మురికిగా ఉన్న దాని విలువ ఇప్పటికీ వంద రూపాయలు.మాస్టారు ఇంకా మాట్లాడుతూ ఈ డబ్బు లాగే మీలో ప్రతి ఒక్కరి విలువ ఎప్పటికీ మారదు కొన్నిసార్లు జీవితం కఠినంగా ఉండవచ్చేమో కానీ, మరియు మీ తప్పులేని ఇబ్బందులను మీరు ఎదుర్కోవచ్చు కానీ, గుర్తుంచుకోండి విద్యార్థులారా ఏమి జరిగినా, ఏది ఏమైనా మీ విలువ ఎప్పటికీ అలాగే ఉంటుంది,ఎప్పటికీ మారదు.అని ఆ విద్యార్థులతో మాస్టారు గారు చెప్పారు.
కథ యొక్క నీతి
మనకు జీవితం ఒక్కసారి తప్పించుకోలేని సవాళ్ల ని తెస్తుంది, మరియు మనందరం కొన్నిసార్లు మన సొంత తప్పు లేకుండా కఠినమైన సమయాలను కూడా అనుభవిస్తాము. అయితే ఈ ఛాలెంజ్ లు మనం ఎంత ప్రత్యేకమైన వారు అని చాటి చెప్పేందుకే వస్తాయి. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న ఎల్లప్పుడూ మీరు విలువైన వారు అని మాత్రం గుర్తుంచుకోండి.