Telugu motivational story
ఏనుగు మరియు త్రాడు
ఒకప్పుడు, ఒక పెద్ద మనిషి ఒక ఏనుగు శిబిరం గుండా ప్రయాణం చేస్తూ ఉండగా ,అతనికి ఆ ఏనుగులను ఒక చిన్న తాడుతో బంధించి ఉండడం గమనించాడు.అయితే శిబిరం నుండి తప్పించుకోకుండా వారిని అడ్డుకుంటున్నది కేవలం ఒక చిన్న తాడు మాత్రమే, అనేది అతను గమనించాడు. అయితే ఏనుగులు తాడును తెంపుకొని శిబిరం నుండి తప్పించుకోవడానికి తమ బలాన్ని ఎందుకు ఉపయోగించలేదు అని,తెలియక ఆ పెద్దమనిషి అయోమయంలో పడ్డాడు. అయితే ఏనుగులు అక్కడ ఎందుకు ఉన్నాయి, అని తప్పించుకోవడానికి ఎప్పుడు ఎందుకు ప్రయత్నించలేదని సమీపంలోని ఒక శిక్షకుడిని వెంటనే వెళ్లి అడిగాడు. అప్పుడు ఆ శిక్షకుడు ఇలా సమాధానం ఇచ్చాడు. ఏనుగులు చాలా చిన్నగా ఉన్నప్పుడు వాటిని కట్టడానికి ఒకే సైజు తాడును ఉపయోగిస్తాము,ఆ వయసులో వాటిని బంధించడానికి ఆ చిన్న తాడలు సరిపోతాయని బదులిచ్చాడు. కానీ ఏనుగులు పెరిగే కొద్దీ అవి ఆ చిన్న తాడు నుండి మేము తప్పించుకోలేము అని ఆ తాడు తమని గట్టిగా పట్టుకోగలదని నమ్ముతాయి కాబట్టి, ఏనుగులు దానిని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించవు అని చెప్పాడు.
ఈ ఏనుగు కథ యొక్క నీతి ఏమిటంటే పరిమితమైన నమ్మకాలు మన పూర్తి సామర్థ్యాన్ని సాధించకుండా ఎలా అడ్డుపడతాయో చెప్పడానికి ఒక ఉదాహరణ ఏనుగుల మాదిరిగానే మనకు కూడా చిన్నతనంలో ఏర్పడిన నమ్మకాలు కొన్ని ఉండవచ్చు.అయితే ఈ నమ్మకాలు మనల్ని మన కంపర్ట్ జోన్లలో ఇరుక్కుపోయేలా చేస్తాయి మరియు రిస్కులు తీసుకోకుండా మరియు మన కలలను కొనసాగించకుండా కూడా చేస్తాయి మనల్ని మనం సవాలు చేసుకోవడానికి మరియు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నట్లయితే మన పరిమిత నమ్మకాల నుండి విముక్తి పొందగల శక్తి మనకు ఉంది అని ఈ కథ మనకు బోధన చేస్తుంది.