10 ways to improve self confidence
మిత్రులారా మనలో చాలామందికి మనం ఎంచుకున్న రంగాలలో, లేదా చేస్తున్న ఉద్యోగాలను ఉన్నత స్థాయికి వెళ్లాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ప్రతి దాంట్లో విజయాలు సాధించడం అంత సులువు కాదు. ముఖ్యంగా దేంట్లో నైనా మనం విజయం సాధించాలంటే మనకు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం కావాలి. అవును నిజం చాలామంది ఈ సమస్యతో పోరాడుతూ ఉంటారు. ఒక విద్యార్థి ఒక కాలేజీలో సెమినార్ ఇవ్వడానికి చాలా భయపడుతూ ఉంటాడు, ఎందుకంటే అతనికి నేను సరైన విధంగా సెమినార్ ఇస్తాను లేదో అన్న ఆత్మవిశ్వాసం లేకపోవడం. తరువాత ఏదైనా ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు కూడా మనలో చాలా భయం ఉంటుంది నేను సెలెక్ట్ అవుతానో లేదో అని. దీనంతటికీ కారణం మనలో తగినంత ఆత్మవిశ్వాసం లేకపోవడమే. ఎప్పుడైతే నిన్ను నువ్వు నమ్ముతావో, ఎప్పుడైతే నీలో విపరీతమైన ఆత్మవిశ్వాసం నింపుకుంటావో ,అప్పుడే విజయం నీకు నల్లేరు మీద నడకైపోతుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మీరు చేయగలిగే అనేక విషయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం మీ గెలుపుకు పునాది వేద్దాం.
Acknowledge your strengths:
మీకు తెలుసో లేదో, లేదా మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ పుట్టిన ప్రతి మనిషికి కొన్ని బలాలు ఉంటాయి. మీకు దేనిలో మంచి పట్టు ఉంది. మీరు ఏమి చేస్తే ఆనందంగా ఉంటారు మరియు మీరు సాధించాలనుకుంటున్న గొప్ప పనుల గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయించండి. మీరు మీ బలాలను గుర్తించిన తర్వాత, వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరియు వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయండి.
2.Set realistic goals:
జీవితంలో ఎప్పుడైనా మీరు సాధించగలిగే లక్ష్యాలు మాత్రమే పెట్టుకోండి. తద్వారా మీరు ఒక లక్ష్యాన్ని సాధించినప్పుడు అది మీకు ఒక సాఫల్య భావాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీ మీద మీకు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. కొన్ని సవాలుగా ఉన్నప్పటికీ సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోండి మరియు మీ విజయాలను మీరు సాధించినప్పుడు, సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి.
3.Take care of yourself:
జీవితంలో మనం ఏమి సాధించాలన్న, ఏమి చూడాలన్నా, ఏమి చేయాలన్నా, ముందుగా మనం ఆరోగ్యకరంగా ఉండడం చాలా ముఖ్యం.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు తగినంత నిద్రపోవడం వంటివి, మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. మీరు మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, మీకు మరింత శక్తి మరియు లక్ష్యాల పై దృష్టి సక్రమంగా ఉంటుంది .ఇది మీకు మరింత ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తుంది.
4.Dress for success:
ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో వస్త్రధారణ ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. మీరు ధరించే విధానం మీ గురించి మీకు ఎలా అనిపిస్తుందో ప్రభావితం చేస్తుంది. మీరు మంచి అనుభూతిని కలిగించే దుస్తులను ధరించినప్పుడు, మీ యొక్క ఆత్మవిశ్వాసం ఎవరికి అందనంత ఎత్తులో ఉంటుంది. మీ శరీరానికి నప్పని దుస్తులను మీరు ధరించినప్పుడు ఇబ్బందికర పరిస్థితులను మీరు ఎప్పుడో ఒకప్పుడు గమనించి ఉంటారు.
5.visualize success:
మీరు సాధించపోయే విజయాలను ముందుగానే ఊహించుకోండి. అలాగే మీ లక్ష్యాలను సాధించడానికి, మిమ్మల్ని మీరు ఊహించుకోవడానికి ప్రతిరోజు కొంత సమయము తీసుకోండి. మిమ్మల్ని మీరు విజయవంతంగా మరియు ఆత్మవిశ్వాసంతో చూసుకోండి. ఇలా చేయడం వలన మీకు మంచి మోటివేషన్ మరియు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
6.Spend time with possitive people:
ఈ పాయింట్ చాలా ముఖ్యం ఈరోజుల్లో మనం విజయాలు సాధించాలన్న, లక్ష్యాలను చేరుకోవాలన్న, మన చుట్టూ మంచి వ్యక్తులు ఉంటేనే క్షేమకరం. కాకపోతే దురదృష్టం ఏమిటంటే ఈ రోజుల్లో భజన గాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. అనగా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అన్నమాట. మీరు సమయం గడిపే వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసం పై పెద్ద ప్రభావాన్ని చూపుతారు. మిమ్మల్ని విశ్వసించేవారు మరియు మీ పనులకు మద్దతు ఇచ్చే వారితో స్నేహం చేయండి. మీకు వ్యతిరేకంగా లేదా ఏ కారణం లేకుండా ఎప్పుడూ విమర్శించే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి.
7.Help others:
ఇతరులకు సహాయం చేయడం అనేది ఒక గొప్ప అలవాటు. ఇతరులకు సహాయం చేయడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఒక గొప్ప మార్గం. మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు మీ గురించి మీరు మంచి అనుభూతి చెందుతారు. మీరు ఎప్పుడు అనుభూతి చెందని ఒక మార్పునైతే మీలో మీరు చూస్తారు. ఇతరులకు సహాయం చేయడం అనేది, మీపై మీకు మరింత నమ్మకం కలిగించేలా చేస్తుంది.
8.Face your fears:
మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మీ భయాలను ఎదుర్కోవడం. మీరు భయపడే విషయాలకు దూరంగా ఉన్నప్పుడు అది మీ భయాలను మరింత దిగజార్చుతుంది. భయాలను ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎప్పుడైతే మీరు మీకున్న భయాలను విజయవంతంగా ఎదుర్కొంటారో అప్పుడు మీపై మీకు ఎనలేని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
9.Take risks:
రిస్క్ తీసుకోవడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మరొక గొప్ప మార్గం. మీరు మీ కంఫర్ట్ జోన్ వెలుపల నుండి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు, మరియు కొత్త విషయాలను ప్రయత్నించినప్పుడు, మీరు అనుకున్న దాని కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉన్నారని మీకు మీరు తెలుసుకుంటారు. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.
Don’t compare with others:
మనలో చాలామంది ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. వారిలో నేను చేయలేనేమో, లేదా ఇతరుల వల్లే నేను సాధించలేను అంటూ వారిలో వారే మదనపడుతూ అక్కడే ఆగిపోతూ ఉంటారు. ఇక్కడ మీరు ఒక విషయం గ్రహించాలి, వ్యక్తులు ఎప్పుడూ అందరూ ఒకేలా ఉండరు. అందరూ కూడా భిన్నంగా ఉంటారు మరియు మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న సొంత ప్రత్యేక ఫలాలు మరియు మీకున్న లక్ష్యాలపై దృష్టి పెట్టండి. తెలుసుకోవడం వలన మీలోని ఆత్మవిశ్వాసాన్ని మీకు మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు.