How to wakeup early morning
హలో ఫ్రెండ్స్ మనలో చాలామంది ఈ ఉ రుకుల పరుగుల జీవితంలో సమయం సరిపోక చాలా బాధపడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, మనకున్న సమయం చాలా తక్కువ. కానీ దీనిని మనము సమయస్ఫూర్తితో అధిగమించవచ్చు. అది ఎలాగా అంటే, మనం చాలా తొందరగా ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల మీకు చాలా సమయం మిగులుతుంది. ఇది మీరు స్వయంగా అనుభవిస్తే మీకు మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సమస్య అంతా అంత పొద్దున్నే ఎలా లేవగలగాలి అనేది ప్రతి ఒక్కరి అనుమానం. మీరు త్వరగా మేలుకోవడానికి కొన్ని పద్ధతులు మరియు కొన్ని విషయాలు ఉన్నవి అవేమిటో వివరంగా ఈ క్రింద చూద్దాం.
1.GET ENOUGH SLEEP:
మనిషికి తగినంత నిద్ర చాలా అవసరం. ఇక్కడ సాధారణంగా పెద్దలకు 7 నుంచి 9 గంటల వరకు నిద్ర అవసరం. మీకు తగినంత నిద్ర లేకపోతే,మీరు ఉదయాన్నే ఎంత తొందరగా మేల్కొన్న కూడా మీరు అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనకు సరిపోయేంత నిద్ర చూసుకోవడం చాలా అవసరం.
2.STICK To SLEEP SCHEDULE:
మనలో చాలామందికి సరైన నిద్ర లేకపోవడానికి కారణం, ఎప్పుడు పడితే అప్పుడు పడుకోవడం . ఎప్పుడు అంటే అప్పుడు నిద్ర లేవడం. ఒక క్రమ పద్ధతి లేని నిద్ర చాలామందికి అలవాటు ఉంటుంది. ఇక వారాంతాల్లో అయితే అసలు సమయమే పాటించము. ఏ అర్ధరాత్రి నిద్రపోయి లేస్తారు. ముందుగా మీరు శరీరానికి ఒక సహజంగా నిద్ర మేల్కొనే క్రమ పద్ధతిని నేర్పండి. అది ఎలా అంటే మనం ప్రతి రోజు కూడా ఒకే సమయానికి పడుకోవడం అలాగే ఒకే సమయానికి మేలుకోవడం వంటి నిత్యం చేస్తూ ఉంటే సహజంగా ఇది శరీరానికి అలవాటుగా మారుతుంది. తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీకు త్వరగా మెలుకువ వస్తుంది.
3.Create a relaxing bedtime:
ఫ్రెండ్స్ మీకు నిద్రపోవడానికి ముందు ప్రతినిత్యం ఏదో ఒక, మీ మనసుకు నచ్చిన పని చేయడం అలవాటు చేసుకోండి. ఉదాహరణకు వెచ్చని నీటితో స్నానం చేయడం లేదా పుస్తకాన్ని చదవడం లేదా మంచి ప్రశాంతమైన సంగీతాన్ని వినడం వంటివి అలవాటుగా చేసుకోండి. ఇవి మీ యొక్క నిద్రకూ చాలా సహకరిస్తాయి .మరియు మరింత సులభంగా మీరు నిద్రపోవడానికి ఈ చిన్న అలవాట్లు సహాయపడతాయి.
4.Avoid caffeine and alcohol before bed:
ఫ్రెండ్స్ కొంతమందికి రాత్రిపూట కూడా కాఫీ మరియు ఆల్కహాల్ వంటి పానీయాలు సేవించడం అలవాటుగా ఉంటుంది. ఒకవేళ మీకు నిద్ర పట్టడం సమస్య ఉన్నట్లయితే ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఈ రెండు కూడా మీకు నిద్ర పట్టడంలో ఆటంకం కలిగిస్తాయి.
5.Make sure your bed is dark,quiet and cool:
ఫ్రెండ్స్ మీరు నిద్రించే గది అత్యంత ప్రకాశమంతంగా ఉన్న లేదా వేడి ఎక్కువగా ఉన్న మీకు నిద్ర పట్టడానికి ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి మీరు నిద్రించే గది సాధ్యమైనంతవరకు తక్కువ వెలుతురుతో నిండిన లైట్స్ తో కానీ, లేదా అసలు వెలుతురు లేకుండా మరియు చల్లగా, ఎటువంటి శబ్దాలు లేని గదిని చూసుకొని నిద్రపోవాలి.
- Don’t hit the Alaram:
ప్రతి ఒక్కరు కూడా అలారం సెట్ చేసుకోవడం ,తీరా అది సమయానికి మోగినప్పుడు వెంటనే దాన్ని ఆఫ్ చేయడం. లేదా తర్వాతకు సెట్ చేసుకొని మళ్లీ పడుకోవడం చేస్తూ ఉంటారు. ఈ అలవాటే మీరు మానుకోవాలి. ఎప్పుడైనా సరే సాధ్యమైనంత వరకు అలారం మోగగానే లేవడానికి ప్రయత్నం చేయండి. లేదా మీకు అలా కుదరకపోతే మీరు పడుకున్న మంచానికి కొంచెం దూరంగా ఉంచండి. అప్పుడు అది మోగ గానే మీరు కొంచెం దూరం నడిచి ఆపడానికి ప్రయత్నం చేయండి. ఇలా కొన్ని రోజులు చేయగానే మీకు అలవాటు అయిపోతుంది.
7.Expose yourself to natural light morning:
ప్రొద్దున్నే సూర్యుడు నుంచి వచ్చే లేలేత కిరణాలు మీ శరీరం యొక్క సహజ నిద్ర మేల్కొనే ప్రక్రియను నియంత్రించడంలో సహాయపడతాయి. మీరు పొద్దున్నే నిద్ర మేల్కొన్నప్పుడు కర్టెన్ లు తెరవండి లేదా అలా కొన్ని నిమిషాలు బయటకు వెళ్లి తిరిగి రండి.
8.Drink glass of water morning:
ఫ్రెండ్స్ ప్రొద్దున లేవగానే ఒక గ్లాసు మంచినీరు త్రాగడం ఒక చక్కటి అలవాటు. మరియు మీ ఆరోగ్యానికి చాలా మంచిది కూడా. పొద్దున లేవగానే డీహైడ్రేషన్ వల్ల అలసటగా అనిపించవచ్చు. ఒక గ్లాసు నీరు త్రాగడం వల్ల మిమ్మల్ని మీరు రీహైడ్రేట్ చేయడానికి మరియు మీకు శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మీకు సమయము కుదిరితే ఒక చక్కని నిమ్మ పండు మరియు ఒక స్పూన్ తేనె కలిపిన గోరువెచ్చ నీరు తాగడానికి ప్రయత్నం చేయండి ఇది మీ రక్తప్రసరణ పెంచడానికి సహాయపడుతుంది.
9.Eat a healthy breakfast:
ఇక అన్ని అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని. ఆరోగ్యకరమైన అల్పాహారం తీసుకోవడం. ఇది మన రోజులు సరిగ్గా ప్రారంభించడానికి ఆరోజు చేసుకోవడానికి గల శక్తిని ఇస్తుంది. దయచేసి పొద్దున పూట అల్పాహారంలో నూనెలో దేవిన చెత్త తో మాత్రం మీ పొట్టతో నింపవద్దు. ఇది మీకు అసౌకర్యాన్ని కూడా కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఉడకబెట్టిన కోడిగుడ్లు లేదా ఓట్స్ వంటి ప్రోటీన్ మరియు ఫైబర్ కలిగిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నం చేయండి.
10.Find something you enjoy doing in the morning:
ఇక చివరిగా మీరు ఏదైనా ఒక అలవాటును ఏర్పరచుకోండి. అది ఎలా ఉండాలి అంటే నిద్ర లేవగానే మీరు ఆ పని చేయడానికి ఎంతో ఉత్సాహంతో ఉండగలగాలి. ఉదాహరణకు వ్యాయామం చేయడం లేదా ఒక మంచి పుస్తకం చదవడం లేదా మీకు బాగా ఇష్టమైన వారితో గడపడం కావచ్చు. దీనివలన మనకు ఉదయం తొందరగా లేవాలి కోరిక బలపడుతుంది.