- ఆకాశంలో అంబు, అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు
సమాధానం- టెంకాయ
- ఆకాశంలో పోయే రాక్షసి పక్షి తొడ పైన కూర్చొని తోడు మాట్లాడు
సమాధానం- పుస్తకం
- ఇంటికి కంటికి కన్ను కంటికి కన్ను మింటికి కన్ను ఇల్లంతా వెలుగు నిచ్చు
సమాధానం- దీపం
- ఈకల ఈరమ్మ ముళ్ల పేరమ్మ సంతకు వెళితే అంతా కొనేవారే
సమాధానం- ఉల్లిపాయ
- ఊరంతా తిరుగుతాయి నీళ్ళు చూసి భయపడతాయి
సమాధానం- చెప్పులు
6.ఎగువ పలక దిగువ పలక పలకల కింద మెలికల పాము
సమాధానం- నాలుక
- ఎక్కలేని చెట్టుకు గంపెడు కాయలు
సమాధానం- మిరప చెట్టు
- ఏమీ లేనమ్మ ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్నా అమ్మ అలిగి మనిగి ఉంటుంది
సమాధానం- విస్తరాకు
- ఒక గూటిలో 32 మంది దొంగలు
సమాధానం- నోటిలో పళ్ళు
- ఒక స్తంభానికి నలుగురు దొంగలు
సమాధానం- లవంగం