
స్టార్ హీరో విజయ్ అభిమానులకు ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే విజయ్ నటించిన లేటెస్ట్ యాక్షన్ చిత్రం GOAT. థియేటర్లలో విడుదలైన అతి కొద్ది రోజులకి OTT లో అలరించడానికి ఈ చిత్రం వచ్చేస్తుంది.
ఇక విజయ్ కి తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విజయ నటించిన గత చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఈ చిత్రంపై కూడా అభిమానులకు మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో మాత్రం మంచి సక్సెస్ సాధించింది, ఈ చిత్రం. ఇక అసలు విషయానికి వస్తే ఈ చిత్ర OTT హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ మూడో తేదీ నుంచి ఈ చిత్రం పలు భాషలు అంటే తెలుగు, మలయాళం, తమిళ్ మరియు కనడ, హిందీలలో అందుబాటులో ఉంటుందని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు.
ఇక థియేటర్లలో మిస్ అయిన వారు ఈ చిత్రాన్నిOTT లో చూసి ఆనందించండి….