దేవర ట్రైలర్లు, టీజర్లు, పాటలు సినిమా విడుదల ఇవన్నీ గతం, ఇప్పుడు అంతా దేవర కలెక్షన్ల పైనే దృష్టి. ఈ చిత్రం ఎంతవరకు రికార్డులు సృష్టిస్తుంది, ఎన్ని సినిమాల రికార్డు కలెక్షన్ అధిగమిస్తుంది అనేది ఇప్పుడు అందరి దృష్టి. ఎందుకంటే మొదటి నుంచి ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.
ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తరువాత ఒక సోలో హీరోగా సినిమా వస్తుండడంతో, అదే విధంగా మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో భారీగా ఈ చిత్రం విడుదల అవుతూ ఉండడం, పైగా మరే సినిమా ఈ చిత్రానికి పోటీలో లేకపోవడంతో ఈ చిత్రం కలెక్షన్లపై అందరి దృష్టిపడింది.
అనుకున్నట్టుగానే మొదటిరోజు దేవర ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్లను అందుకుంది. దాదాపు అందుబాటులో ఉన్న అన్ని థియేటర్లలో దేవర చిత్రం ప్రదర్శింపబడింది. దీంతో ఎన్టీఆర్ కెరియర్ లోనే అత్యంత భారీ ఓపెనింగ్స్ ను ఈ చిత్రంతో సాధించాడు.
ఇక ఈ సంవత్సరంలో పెద్ద సినిమాలు అంతగా విడుదల అవ్వకపోవడం కేవలం మహేష్ ,ప్రభాస్ హీరోల చిత్రాలు మాత్రమే విడుదలయ్యాయి. దాంతో పెద్ద సినిమాలు లేక వేలవేల పోతున్న థియేటర్లను ఎన్టీఆర్ దేవర చిత్రంతో కళకళలాడించాడు.
ఇక మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్లు, సాధించిన దేవర చిత్రం రెండో రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్లు అందుకోనప్పటికీ, తిరిగి ఆదివారం నాడు ఈ చిత్రం రెండో రోజు కంటే ఎక్కువ కలెక్షన్లు నమోదు చేసింది.
ఇక పెద్ద హీరోల సినిమాలకు పెద్ద పరీక్ష ఏది అంటే అది సోమవారం, ఎంత పెద్ద హిట్టు సినిమా అయినా సోమవారం వచ్చేసరికి కలెక్షన్లు దారుణంగా పడిపోవడం సహజమే. దేవర కూడా అదే విధంగా కలెక్షన్లో డ్రాప్ అయిన సంగతి తెలిసిందే.
ఇక అసలు విషయం ఏంటంటే ఈరోజు నుండి అంటే అక్టోబర్ రెండు గాంధీ జయంతి కావడం, అలాగే రేపటినుండి దసరా సెలవులు కూడా ప్రారంభం అవుతుంది దేవర చిత్రానికి ఇంకా పది రోజులు బాక్సాఫీసును ఏలే అవకాశం అయితే వచ్చింది.
. ఇక ఈవారం చూసుకున్నట్లయితే శ్రీ విష్ణు “SWAG” చిత్రం మాత్రమే అంతో ఇంతో ప్రామిసింగ్ మూవీ గా కనిపిస్తోంది. మిగతావన్నీ కూడా చిన్న చిత్రాలే. దాంతో ఈ వారం కూడా ఎన్టీఆర్ దేవర చిత్రమే బాక్సాఫీస్ కింగ్ గా నిలబడే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
దాదాపు విడుదలైన అన్నిచోట్ల కూడా దేవర చిత్రం బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చేసింది. ఇక ఈ పది రోజులు గడిచేసరికి ఈ చిత్రం మంచి లాభాలు ఇస్తుంది అనడంలో సందేహం లేదు.