యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దాదాపు 6 సంవత్సరాల తర్వాత, విడుదలైన చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించ గా వీళ్ళిద్దరి కాంబినేషన్లో గతంలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్టు సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.
అంచనాలకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 27 తేదీన విడుదలైన దేవర చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించిన యాక్షన్ సీక్వెన్స్‌లు అదిరిపోగా, ఈ సినిమాకు అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది.
ఇక చిత్ర నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 172 కోట్లు అయితే సాధించింది. ఇక రెండవ రోజున ఈ చిత్రం మొత్తంగా కలిపి 243 కోట్ల వరకు సాధించింది. మొదటి రోజుతో పోల్చుకుంటే ఈ చిత్రం రెండవ రోజు కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే. అయితే తిరిగి సండే రోజున ఈ చిత్రం రెండో రోజు కన్నా ఎక్కువ కలెక్షన్లు సాధించింది.
దీంతో ఈ చిత్రం మూడు రోజులకు కలిపి మొత్తంగా 304 కోట్లు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల దాదాపు బ్రేక్ ఈవెన్ దగ్గరగా వచ్చింది.
అటు హిందీ మార్కెట్లో కూడా మొదటిరోజు ఏడు కోట్లు కలెక్షన్ సాధించగా రెండో రోజు 9 కోట్లు ఆపై ఆదివారం మరింత వసూళ్లను సాధించింది. దీంతో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి చిత్రం తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఎన్టీఆర్ దేవర చిత్రం నిలిచింది.
రెండు ,మూడు రోజుల్లో దసరా సెలవులు కూడా మొదలవుతుండడంతో ఈ చిత్రం 500 కోట్ల మార్కు ఈజీగా టచ్ చేసుకొని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.