నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కినచిత్రం దేవర. ఇక ఈ చిత్రం రిలీజ్ కన్నా ముందే పలుచోట్ల కని విని ఎరుగని రికార్డు స్థాయిలో బుకింగ్స్ నమోదు అయ్యాయి. ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా వస్తున్న మూవీ కావడంతో అభిమానులు ఎక్కడికక్కడ కటౌట్లు,1 am షోలు అంటూ అభిమానులు చేసిన హడావిడి అంతా ఇంత కాదు.
ఇక సినిమా విడుదలైన తర్వాత, కొంచెం మిక్స్డ్ టాక్ తో అయితే ఈ సినిమా నడుస్తోంది. అది మొదటి రోజు సినిమా వసూళ్ల పై ఏమాత్రం ప్రభావం చూపలేదు. యంగ్ టైగర్ మొదటి రోజు కలెక్షన్ల ప్రభంజనం సృష్టించాడు.
మొదటిరోజు ఆల్మోస్ట్ అన్ని సెంటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడిచాయి. ఇక మూవీ టీం అధికారికంగా ప్రకటించిన మొదటి రోజు కలెక్షన్ల ప్రకారం ఈ చిత్రం185 కోట్ల గ్రాసును సాధించినట్లు తెలిపింది. ఇక రెండో రోజు చూసుకున్నట్లయితే ఈ చిత్ర కలెక్షన్లు కొంచెం తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. అధికారికంగా ప్రకటించిన రెండో రోజు కలెక్షన్లతో కలిపి మొత్తంగా ఈ చిత్రం రెండు రోజులకు గాను 243 కోట్లు సాధించినట్టు , నిర్మాణ సంస్థ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో రెండో రోజు కేవలం అటు ఇటుగా 60 కోట్లు మాత్రమే ఈ చిత్రం సాధించినట్లు అర్థం అవుతుంది.
ఈరోజు ఆదివారము మరియు రెండు రోజుల్లో మొదలయ్యే దసరా సెలవులు ఉండడంతో ఈ చిత్రం అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్లు సాధించి రికార్డు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించగా, ఈ చిత్రానికి అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని బలంగా నిలిపింది.
అటు కొరటాల శివకు, ఆచార్య వంటి డిజాస్టర్ తర్వాత ఈ చిత్రం కొంత ఊరట కలిగించిన విషయం వాస్తవం. ఇక ఈ చిత్రంతో జాన్వి కపూర్ మొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.