కథ :
devara review : దేవర చిత్ర కథ సముద్ర తీర ప్రాంతంలో నుండి మొదలవుతుంది. కొందరు పోలీసు అధికారులు సముద్ర మార్గంలో జరిగే అక్రమ సరుకు రవాణా గురించి తెలుసుకునే క్రమంలో.. సింగప్ప అనే పాత్ర ద్వారా దేవర కథ మొదలవుతుంది.. ఇక కథలోకి వెళితే కొండమీద ఉన్న నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒక ఊరికి ఒక్కో వ్యక్తి నాయకుడిగా ఉంటాడు. అలా ఒక ఊరికి ఎన్టీఆర్ దేవరగా మరియు మరొక ఊరికి బైర గా సైఫ్ అలీఖాన్ నటించారు.
వీరి గ్యాంగులు కలిసి రాత్రిపూట సముద్ర మార్గంలో అక్రమ సరుకు రవాణాను దొంగలించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో ఆ నాలుగు ఊర్లు జీవితం సాగిస్తూ ఉంటాయి.. అలా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఒకానొక సందర్భంలో ఒక సంఘటన దేవరను విపరీతంగా కలచివేస్తుంది.
దాంతో ఇక దేవర ఈ అక్రమ సరుకు రవాణా చేయకూడదని నిర్ణయించుకుంటాడు. అంతేకాదు తన గ్యాంగ్ అయిన బైరా గ్యాంగును కూడా ఈ తప్పుడు పనులు మానేయాలని, చేపలు పట్టుతూ జీవితం సాగించాలని చెబుతాడు. అయితే అందుకు ఇష్టపడని బైరా, దేవరకు ఎదురు తిరుగుతాడు.
ఆ తర్వాత దేవర వారిని ఆపగలిగాడా, చివరకు దేవర ఏమయ్యాడు. తర్వాత వచ్చే దేవర కొడుకు వర, బైరాను ఎలా ఎదుర్కొన్నాడు వంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
నటన:
ఇక దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తనదైన శక్తివంతమైన నటనతో సినిమా లో ఆకట్టుకున్నారు. సినిమాలో వచ్చే అన్ని యాక్షన్ సన్నివేశాల లో ఎన్టీఆర్ అద్భుతమైన పర్ఫామెన్స్ చూపించాడు. అటు కొన్ని ఎమోషనల్ సీన్లలో కూడా మంచి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు. ఎన్టీఆర్ స్క్రీన్ పై ఉన్నంతసేపు ప్రేక్షకులను తన అద్భుతమైన నటనతో అలరించాడు. ఇక మిగతా నటి నటుల విషయానికి వస్తే ఇందులో విలన్ గా నటించిన సైఫ్ అలీఖాన్ తన పాత్ర మేరకు ఎన్టీఆర్కు కొన్ని కొన్ని సన్నివేశాలు లో దీటుగా నటించాడు. కాకపోతే డబ్బింగ్ అతనికి అంతగా నప్పలేదేమో అని అనిపిస్తుంది.. ఇక శ్రీకాంత్ తను ఉన్నంతసేపు తన పాత్ర మేరకు నటించాడు. ఇక మెయిన్ గా చూసుకుంటే తెలుగులో ఎంట్రీ ఇచ్చిన . జాన్వి కపూర్ ఈ చిత్రంలో కేవలం ,ఒక పాటకు మరియు ఓ 15 నిమిషాల పాటు అది సెకండ్ హాఫ్ లో మాత్రమే కనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్:
1. జూనియర్ ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు మరియు కొన్ని ఎమోషనల్ సీన్లు
2. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
3. విజువల్ ఎఫెక్ట్స్,
మైనస్ పాయింట్స్:
1. కదా మధ్యలో నెమ్మదించడం, కొన్ని సన్నివేశాలు అవసరం లేనివి గా అనిపించడం
2. ఎమోషనల్ సీన్లు ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాకపోవడం
3. సెకండ్ ఆఫ్ అంతగా కుదరకపోవడం మరియు సీక్వెల్ కి బ్యాక్ డ్రాప్ గా తీసుకోవడం వల్ల కథ పూర్తిగా రౌండప్ చేయకపోవడం.
టెక్నికల్ అంశాలు:
ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది ఎందుకంటే ప్రతి సీను విజువల్స్ పరంగా చాలా బాగా తెరకెక్కించారు. ఇక అనిరుద్ అందించిన నేపథ్య సంగీతం సినిమాలో ప్రతి సన్నివేశానికి అద్భుతమైన బలం చేకూర్చింది. అయితే స్క్రీన్ ప్లే కొద్దిగా సాగదీసినట్లు అనిపిస్తుంది.
ఫైనల్ రివ్యూ:
దేవర చిత్రం ప్రేక్షకులకు ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ నటన మరియు యాక్షన్ సన్నివేశాలు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. అయితే కొంత కథ, స్క్రీన్ ప్లే పరంగా కొన్ని బలహీనతలు ఉన్న విజువల్స్ మరియు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను నిలబెట్టాయి. ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఈ సినిమా ఒక మంచి యాక్షన్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకునే విధంగా ఉందా అనే విషయం తేలాలి అంటే ఇంకో వారం వేచి చూడాలి..
RATING : 3/5