స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్గా మరియు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. దాదాపు ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తరువాత హీరోగా వస్తున్న చిత్రంతో ,ఈ చిత్రంపై అటు సినీ అభిమానులతో పాటు ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
2022లో విడుదల అయిన RRR చిత్రంతో PAN ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, ఇప్పుడు దేవర చిత్రంతో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్నాడు. నిజానికి గతంలో ఎన్టీఆర్ చిత్రాలు ఎన్నో వచ్చాయి, కానీ దేవర చిత్రంపై ఉన్న విపరీత అంచనాలు గత చిత్రాలకు అంతగా లేవనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర ట్రెండింగ్ లో మోత మోగిపోతుంది.
ఇప్పుడున్న యంగ్ హీరోలలో అందరికన్నా ముందు స్టార్డం చూసిన ఏకైక హీరో ఎన్టీఆర్, అయినప్పటికీ PAN ఇండియా స్థాయిలో ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. ఇక దేవర చిత్రంతో PAN INDIA అనే స్థాయిని ఎన్టీఆర్ అవలీలగా అందుకోగలడు. నటనాపరంగా ఎంతో అద్భుతమైన ప్రదర్శన చేయగల ఎన్టీఆర్ ఈ చిత్రంతో మరింత ఎత్తుకు ఎదుగుతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఇక అసలు విషయం ఏమిటి అంటే, ఈ సంవత్సరం మహేష్ నటించిన గుంటూరు కారం మినహా మిగతా పెద్ద హీరోల సినిమాలు అంతగా విడుదల అవలేదు. దానితో థియేటర్లు విలవిల పోవాల్సిన పరిస్థితి. కేవలం చిన్న మరియు బడ్జెట్ చిత్రాలతోనే ఇప్పటివరకు థియేటర్లు కొనసాగాయి.
ఇక సినీ అభిమానుల ఆకలి తీర్చే సినిమా గా దేవర మారనున్నది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నియోజకవర్గ స్థాయి నుంచి పల్లెటూరు స్థాయి థియేటర్ల వరకు, ఎక్కడ చూసినా ప్రతి థియేటర్ ఎన్టీఆర్ కటౌట్లు, బ్యానర్లతో నిండిపోయి ఉన్నాయి. ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు మొత్తం దేవర చిత్రం ప్రదర్శనకు సిద్ధంగా ఉంది. దీంతో మొదటి రోజు దేవర చిత్రం సంచలన కలెక్షన్లు సాధిస్తుంది అనడంలో సందేహం లేదు. అటు బుక్ మై షో లో కూడా గంటకు 20వేల టికెట్లకు పైగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. దీంతో కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్, బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయబోతున్నాడు.