విలక్షణ నటుడు రావు గోపాలరావు వారసత్వంగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రావు రమేష్ తనదైన శైలిలో అద్భుతమైన పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
కొన్ని కొన్ని పాత్రలు ఆయన మాత్రమే చేయగలడా అనిపించేలా ఉంటాయి. అలాంటి రావు రమేష్ ఒక ప్రధాన పాత్రలో మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో నటించాడు. ఇక ఈ చిత్రాన్ని లక్ష్మణ్ అనే దర్శకుడు రూపొందించాడు. ఈ చిత్రం ఆగస్టు 23వ తేదీ థియేటర్లలో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
ఇక ఈ సినిమా కథ చూసుకున్నట్లయితే, సినిమా మొత్తం సుబ్రహ్మణ్యం అనే పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను నిరుద్యోగి అవడం వల్ల , జీవితంలో కష్టాలు ఎదుర్కొంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు .ఒకసారి ఒక విచిత్రమైన పరిస్థితుల్లో అతని అకౌంట్లోకి కొంత డబ్బులు వచ్చి చేరడంతో, అతను ఏ మాత్రం ఆలోచించకుండా ఆ డబ్బులు మొత్తం ఖర్చు చేస్తాడు. దాని ద్వారా అతను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, కష్టాలు ఏమిటి అనే ఇదే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశం.
చిత్రం మంచి కుటుంబ సన్నివేశాలను కూడా కలిగి ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరిస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశాము అన్న ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుంది ఈ చిత్రం చూసిన తర్వాత. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ తో పాటు ఇంద్రజ అలాగే అజయ్ మరియు అన్నపూర్ణమ్మ ,అంకిత్ కొయ్య వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో మంచి పాత్రలు పోషించారు.
థియేటర్లలో మంచి స్పందనను రాబట్టుకున్న ఈ చిత్రం ఆహా అనే ott ప్లాట్ ఫామ్ లో ఈనెల సెప్టెంబర్ 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో థియేటర్లలో అంతగా అలరించకపోయినా సినిమాలు కూడా ott లలో దుమ్ములేపుతున్నాయి. మరి ఫ్యామిలీ ఎమోషన్స్ తో నిండిన చిత్రం కూడా మంచి ఆదరణ పొందుతుంది అనడంలో ఆసక్తి లేదు. మీరు కూడా ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ చేసి ఉంటే ,తప్పకుండా డిజిటల్ ప్లాట్ఫారం లో వీక్షించండి.