నందమూరి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా అలాగే అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్ గా మరియు కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం దేవర. ఇక ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా విడుదల పది రోజులు ముందే తారక్ దేశమంతా సినిమాను ప్రమోషన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక సినిమాకు విపరీతమైన అటెన్షన్ను తీసుకొచ్చేది ఈ మధ్యకాలంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎంత గ్రాండ్ గా జరిగితే సినిమాకు అంత పబ్లిసిటీ వస్తుంది. ఇక దేవర సినిమాకు సంబంధించి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ సెప్టెంబర్ 22వ తేదీన చేస్తున్నట్లు డేట్ ని కూడా ప్రకటించారు. అయితే ఒక స్టార్ హీరో ఈవెంట్ అనగానే ఆ ఈవెంట్ కు ఎవరు చీఫ్ గెస్ట్ గా వస్తారా అని అభిమానులు ఎదురు చూడడం మామూలే.
అయితే సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ చిత్రంకి స్టార్ దర్శకుడు రాజమౌళి అలాగే ఈ చిత్ర నిర్మాతకు అత్యంత సన్నిహితుడు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసు, అలాగే తారక్ తో ఈ చిత్రం తర్వాత చేయబోయే దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఈ చిత్ర ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వస్తారని తెలుస్తోంది.
అయితే దీనిపై ఈ చిత్ర అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి ఇప్పటికే అదిరిపోయే పాటలతో, అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ట్రైలర్ కూడా అందించాడు ఈ చిత్ర సంగీత దర్శకుడు అనిరుద్. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.
ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవబోతుంది.