సాధారణంగా హీరోయిన్ల విషయంలో వారికి పెళ్లి అయిన తర్వాత సినిమాలలో అవకాశాలు తగ్గుతూ వస్తాయి, కానీ కాజల్ విషయంలో దీనికి పూర్తి భిన్నం. ఇటీవలే నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరితో సూపర్ హిట్ను కైవసం చేసుకున్న కాజల్ ఇప్పుడు మరో లేడీ ఓరియంటెడ్ చిత్రంతో మన ముందుకు రాబోతున్నది.. ఇక ఈ చిత్ర టైటిల్” సత్యభామ “ఈ చిత్రం ఈనెల మే 17వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతున్నది. ఈ చిత్రంలో కాజల్ మంచి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సత్యభామ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ లో కాజల్ ఫుల్ బిజీగా టైం గడుపుతూ ఉంది.
ప్రమోషన్స్ లో భాగంగానే ఆలీతో సరదాగా సీజన్ 2 అనే ప్రోగ్రాంకు ఇటీవల హాజరయ్యింది. తాజాగా విడుదలైన ఈ ఆలీతో సరదాగా ప్రోగ్రాం ప్రోమో లో కాజల్ తన ప్రేమ మరియు పెళ్లి అలాగే తన సినిమా కెరియర్ విషయాలపై ఎన్నో విశేషాలను పంచుకుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఆలీతో సరదాగా ప్రోగ్రాం లో అలి వేసే పంచులు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే కదా, మీరు పెళ్లి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ చిత్రాలకి ప్రాముఖ్యత ఇస్తున్నారు, ఇలాంటి చిత్రాలే చేయాలి అని మీ భర్త ఏమైనా కండిషన్ పెట్టాడా అని కాజల్ అడిగాడు. అయితే అదృష్టం కొద్దీ నా భర్త సినిమా లో నటించేటప్పుడు ఎలాంటి కండిషన్స్ పెట్టడని సమాధానం చెప్పింది. నాకు మామూలు సినిమాల కంటే పవర్ఫుల్ ఉమెన్ క్యారెక్టర్ చేయడం అంటే ఎంతో ఇష్టం అని, తనకున్న అభిప్రాయం తెలిపింది. అలాగే సినిమాలలో విలన్ లను కొట్టే సీన్స్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పింది. ఆ కోరిక ఈ చిత్రంతో అయితే తీరిందని తన అభిప్రాయం తెలిపింది.
అలాగే కళ్యాణ్రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కళ్యాణం తన కెరియర్ లో మొదటిగా అటెండ్ అయినా అడిషన్ అని, ఆ అడిషన్ లో దర్శకుడు తేజ తనను ఏడవమన్నాడు అని కారణం లేకుండా ఎలా ఏడవాలో నాకు తెలియదని, అలాంటి సందర్భంలో నాన్న నాతో కావాలని గట్టిగా అరవడంతో నేను కన్నీళ్లు పెట్టుకున్నాని కాజల్ తెలిపింది. దానితో దర్శకుడు ఈ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇచ్చారని కూడా తెలిపింది.
ఇక అలాగే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా అని అని అడిగిన ప్రశ్నకు కాజల్ ఈ విధంగా జవాబు ఇచ్చింది. నేను అక్కడ బ్యానర్ లేదా డైరెక్టర్ చూసో ఆ చిత్రంలో ఐటెం సాంగ్ చేయలేదు. కేవలం నాకు జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే ఆ చిత్రంలో ఆ పాటను చేయడం జరిగిందని కాజల్ వివరించింది. ఇక కాలేజీలో చదువుకునేటప్పుడు తనకు చాలా లవ్ లెటర్స్ వచ్చాయని ఆ లెటర్స్ చూసి ఎవరిని ఏమీ అనలేదని తెలిపింది. అలాగే అందులో ఓ యువకుడు రాసిన లవ్ లెటర్ తనకు చాలా నచ్చిందని చెప్పింది. మరి ఇలాంటి విషయాలతో నిండిన అలీతో సరదాగా సీజన్ 2 ప్రోమోను మీరు కూడా ఓ లుక్కు వేయండి…