టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల లో శ్రీ విష్ణు కూడా ఒకరు. రాజరాజ చోర, బ్రోచేవారెవరురా మరియు ఇటీవలే సామజ వరగమన వంటి ఎంటర్టైనింగ్ చిత్రాలను అందించిన శ్రీ విష్ణు ఈసారి మరొక కొత్త చిత్రంతో మన ముందుకు రాబోతున్నారు. సామజ వర గమన చిత్రంలో వెటకారపు కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన శ్రీ విష్ణు మరొక ఫన్నీ టైటిల్ తో మరింత నవ్వించడానికి రాబోతున్నాడు అని ఈ చిత్ర టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది.
గతంలో బ్రోచేవారెవరురా కాంబినేషన్లో రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శి వంటి వారు ఈ చిత్రంలో మరొకసారి నటిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై ఓ మోస్తరు అంచనాలైతే పెరిగిపోయాయి. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు విడుదల తేది కూడా మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 22వ తేదీన థియేటర్లలో విడుదల అవుతున్నట్టు ప్రకటించారు. ఇక ఈ చిత్రానికి హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తూ ఉండగా v celluloids సంస్థ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.